జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దాని హిందీ రీమేక్ ఫ్లాప్ అయ్యాక చాలా టైం తీసుకుని విజయ్ దేవరకొండతో కింగ్డమ్ తీసిన సంగతి తెలిసిందే. అయితే ఊహించని విధంగా అది డిజాస్టర్ కావడం పెద్ద షాక్. ప్యాన్ ఇండియా లెవెల్ లో సౌండ్ చేస్తుందనుకుంటే మంచి ఓపెనింగ్స్ తీసుకుని తర్వాత చప్పుడు లేకుండా వెళ్ళిపోయింది. అయితే కింగ్డమ్ టైంలోనే అదే సితార బ్యానర్ లో గౌతమ్ తిన్ననూరి మేజిక్ అనే మరో తక్కువ బడ్జెట్ సినిమా తీశారు. షూటింగ్ ఎప్పుడో ఫినిషయ్యింది.
కానీ తర్వాత అప్డేట్స్ పూర్తిగా ఆగిపోయాయి. కొత్త కుర్రాళ్ళు, అమ్మాయిలు నటించిన ఈ మేజిక్ లో దురంధర్ ఫేమ్ సారా అర్జున్ కూడా నటించింది. అసలు విశేషం ఇది కాదు. సౌత్ ఇండియన్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ దీనికి సంగీతం సమకూర్చారు. ఒక లిరికల్ సాంగ్ ఆల్రెడీ వచ్చేసిన విషయం కామన్ ఆడియన్స్ కి తెలియదంటే ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు. ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన అనిరుధ్ లైవ్ కాన్సర్ట్ లో మేజిక్ ఆడియో లాంచ్ ఉంటుందని ఫాన్స్ అనుకున్నారు.
కానీ అలాంటిదేమి జరగలేదు. సితార సంస్థ సైతం మేజిక్ రిలీజ్ కు చొరవ తీసుకుంటున్న దాఖలాలు లేవు. భారీ విఎఫ్ఎక్స్ డిమాండ్ చేసే మూవీ అయితే ఏదో అనుకోవచ్చు. సింపుల్ గా యూత్ మీద తీసిన కాలేజీ స్టోరీకి ఇంత జాప్యం ఎందుకనేది అంతు చిక్కని ప్రశ్న. ప్యారడైజ్ వాయిదా పడ్డాక అనిరుధ్ కు అదనపు సమయం దొరికింది. దాన్ని మేజిక్ కోసం వాడుకుని ఉండొచ్చు. కానీ ఎందుకు పక్కన పెడుతున్నారనేది అంతు చిక్కడం లేదు.. బయటికి చెప్పడం లేదు.
బయట గౌతమ్ తిన్ననూరి కనిపించడం మానేశారు. కొత్త స్క్రిప్ట్ లో బిజీగా ఉన్నారో లేక మేజిక్ కు ఏమైనా ఫైనల్ టచ్ ఇస్తున్నారో ఆయనకే తెలియాలి. అయినా హిట్టు ఫ్లాపు సంగతి పక్కనపెడితే ముందైతే సిద్ధంగా ఉన్న ప్రోడక్ట్ ని వీలైనంత త్వరగా మార్కెట్ లో అమ్మకానికి పెట్టేయాలి. కాంబినేషన్ క్రేజ్ లేకపోయినా అనిరుద్ బ్రాండ్, నిర్మాణ సంస్థ ఇమేజ్, యూత్ కంటెంట్ బజ్ అయితే తీసుకొస్తాయి. మరి ఆ దిశగా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో మేజిక్ మేకర్స్ కే తెలియాలి.
This post was last modified on March 24, 2026 7:56 pm
ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…
మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…