Movie News

పవన్ మార్కెట్ దెబ్బ తినేసిందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు. ఆయన ఎలాంటి సినిమా చేసినా ఓపెనింగ్స్‌కు ఢోకా ఉండదు. ఫ్లాప్ సినిమాలతో కూడా భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఘనత ఆయన సొంతం. మేకింగ్ దశలో ఉండగా పెద్దగా బజ్ లేని సినిమాలకు కూడా రిలీజ్ ముంగిట హైప్ వచ్చేస్తుంది. ఓపెనింగ్స్ మోతెక్కిపోతుంటాయి. కానీ ఈ మధ్య పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ఆయన సినిమాలు మినిమం గ్యారెంటీ జోన్లోకి రావట్లేదు. ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో ఉండట్లేదు. 

ఫ్యాన్స్ ఎప్పట్లాగే పవన్ సినిమా వస్తే ఎగ్జైట్ అవుతున్నారు కానీ.. న్యూట్రల్ ఆడియన్స్ క్రమంగా ఆయన సినిమాలకు దూరమవుతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. గత కొన్నేళ్లలో పవన్ నటించిన చిత్రాల్లో బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితం రాబట్టింది ఒక్క ‘ఓజీ’ మాత్రమే. సుజీత్ పవన్‌ను అదిరిపోయే రేంజిలో ప్రెజెంట్ చేయడమే కాక.. సూపర్ ప్రోమోలతో సినిమాకు మొదట్నుంచి మంచి బజ్ తీసుకొచ్చాడు. అది రిలీజ్ వరకు కొనసాగింది. మంచి టైమింగ్‌లో రిలీజై సినిమా చక్కటి ఫలితాన్ని అందుకుంది.

కానీ దాని కంటే ముందు వచ్చిన ‘హరిహర వీరమల్లు’ దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ముందు రోజు ప్రిమియర్ల వరకు మాత్రమే సినిమా బాగా పెర్ఫామ్ చేసింది. రిలీజ్ రోజే ఆక్యుపెన్సీలు పడిపోయాయి. ఏళ్ల తరబడి మేకింగ్‌లో ఉండడం వల్ల బడ్జెట్ అసాధారణంగా పెరిగిపోయి, సరైన బిజినెస్ జరగక.. వసూళ్లూ ఆశించిన స్థాయిలో రాక నిర్మాత ఏఎం రత్నం అన్యాయం అయిపోయాడు.

దాని కంటే ముందు పవన్ చేసిన ‘బ్రో’ మూవీ కూడా నిరాశనే మిగిల్చింది. నిర్మాతకు నష్టాలు తెచ్చిపెట్టింది. ఇక వర్తమానంలోకి వస్తే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా డిజాస్టర్ దిశగానే అడుగులు వేస్తోంది. ‘దురంధర్-2’ లాంటి క్రేజీ మూవీ ఉన్నప్పటికీ.. పవన్ క్రేజ్‌ను నమ్ముకుని దానికి పోటీగా ‘ఉస్తాద్’ను బరిలో నిలిపారు. కానీ ఈ సినిమాలో సరిపడా విషయం లేకపోవడంతో తడబాటు తప్పలేదు. 

పవన్ స్టార్ పవర్ ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ తెచ్చిపెట్టింది కానీ.. సినిమాను నిలబెట్టలేదు. న్యూట్రల్ ఆడియన్స్ సినిమా పట్ల అంత ఆసక్తితో లేరని స్పష్టంగా అర్థమైపోయింది. కేవలం ఫ్యాన్ మూమెంట్స్‌తో సినిమా నిలబడదని తేలిపోయింది. పవన్ మార్కెట్ దెబ్బ తిందని, ఆయనతో సినిమా అంటే పెద్ద రిస్క్ అయిపోయిందనే చర్చ జరుగుతోంది ఇండస్ట్రీలో.

పవన్ సినిమా అంటే కంటెంట్ పెద్దగా ఉండదని, ఏదో మొక్కుబడిగా సినిమాలు చేస్తాడనే అభిప్రాయం పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఫ్యాన్స్‌లోనూ క్రమంగా ఎగ్జైట్మెంట్ తగ్గుతోంది. న్యూట్రల్ ఫ్యాన్స్ ఆయనకు క్రమంగా దూరం అయిపోతున్నారు.

This post was last modified on March 23, 2026 10:48 pm

Share

Recent Posts

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

3 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

4 hours ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

4 hours ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

6 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

9 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

9 hours ago