ఇవాళ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి వచ్చిన ట్వీట్ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం పవన్ ఎలాంటి కొత్త కమిట్ మెంట్స్ ఇవ్వలేదని, ఓజి 2 గురించి సమయం వచ్చినప్పుడు ఆయనే చెబుతారని అందులో పేర్కొన్నారు. దర్శకుడు సుజిత్ ఎలాగూ నాని బ్లడీ రోమియోతో బిజీ కాబోతున్నాడు. 2026 దానికే సరిపోతుంది కాబట్టి ఓజి సీక్వెల్ మీద వర్క్ వచ్చే సంవత్సరం కంటే ముందే ఆశించలేం. సో చాలా టైం ఉంది.
దీని సంగతి పక్కనపెడితే సురేందర్ రెడ్డితో ఓకే చేసుకున్న ప్రాజెక్టు మీద ఇక్కడ క్లారిటీ మిస్ అవుతోంది. రామ్ తాల్లూరి నిర్మాతగా ఇది ఎప్పుడో అనౌన్స్ చేసిన ప్రాజెక్టు. ఆ మధ్య ఇద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. తీరా చూస్తే ఇప్పుడప్పుడే మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. గత కొన్ని నెలలుగా పవన్ మైంటైన్ చేస్తున్న గడ్డం, హెయిర్ స్టైల్ సూరి మూవీ కోసమే అన్నది ఓపెన్ ఫాక్ట్. మరి ఎప్పుడు స్టార్ట్ అనేదే అసలు ప్రశ్న.
ఉస్తాద్ భగత్ సింగ్ ఫలితం పవన్ మీద ప్రభావం చూపిస్తుందని అనుకోలేం. ఎందుకంటే హీరోగా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే హిట్లు ఫ్లాపుల గురించి పెద్దగా ఆలోచించలేదు. అలాంటిది ఏపీ డిప్యూటీ సిఎంగా ప్రజాపాలనలో బిజీగా ఉన్న టైంలో ఫలానా సినిమా పోయిందంటే దాని గురించి అనాలిసిస్ చేసే తీరిక ఉండదు. సో రిజల్ట్ ఇక్కడ మ్యాటర్ కాదు. కాకపోతే నెక్స్ట్ ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళిక వేసే ఆలోచనలో జనసేన రెడీ అవుతున్న సమయంలో పవన్ ధ్యాస రాజకీయాల మీదే ఉంటుంది.
ట్వీట్ సంగతి ఎలా ఉన్నా సురేందర్ రెడ్డి సినిమా దాదాపు ఫిక్స్ అయినట్టే. ఫైనల్ నెరేషన్ కనక సంతృప్తికరంగా అనిపిస్తే సెట్స్ పైకి ఎప్పుడు వెళ్లాలనేది నిర్ణయిస్తారు. దీని తర్వాత ఇంకే ప్రొడక్షన్ హౌస్ కు పవన్ ఫిక్స్ అవ్వలేదు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కెవిఎన్ ప్రొడక్షన్స్, దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాణ సంస్థలు సిద్ధంగానే ఉన్నాయి కానీ కాంబోలు కుదరడమే సవాల్ గా మారింది. అంతకన్నా ఎక్కువగా పవన్ కళ్యాణ్ డేట్లు తెచ్చుకోవడమే పెద్ద టాస్క్. ప్రొడ్యూసర్లకు కావాల్సింది అదే.
This post was last modified on March 24, 2026 1:14 am
తెలుగులో కామెడీ సినిమాలతోనూ స్టార్ కావచ్చని ముందుగా రుజువు చేసింది రాజేంద్ర ప్రసాద్ అయితే.. ఆయన తరువాత ఆ స్థాయిలో…
రాబోయే ఎన్నికల వ్యూహాల్లో భాగంగా వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు…
మలయాళ లెజెండరీ నటుడు మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ తన మాతృభాషలో గొప్ప గొప్ప సినిమాలు చేశాడు. ఎన్నో సూపర్…
ఉత్తరప్రదేశ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత రామజన్మభూమి అయోధ్యలో ఉన్న బాలరామయ్య ఆలయానికి రాజకీయ గ్రహణం వీడినట్టేనా? ఇక, ఆలయానికి రాజకీయ ప్రభావం,…
సౌత్ ఇండియన్ సినిమాలో మోస్ట్ సెలబ్రేటెడ్ సినీ బ్రదర్స్‌లో సూర్య-కార్తి ద్వయం ముందు వరుసలో ఉంటుంది. వీళ్లిద్దరూ తండ్రి శివకుమార్…
టాలీవుడ్ కామెడీని కొత్త పుంతలు తొక్కించిన వాళ్ళలో జంధ్యాల, రేలంగి నరసింహరావు, సింగీతం శ్రీనివాసరావు తర్వాత ఈవివి సత్యనారాయణ తనకంటూ…