కాన్సెప్ట్ నమ్ముకుని తక్కువ ఖర్చుతో సినిమాలు తీయడంలో అందరికన్నా మలయాళ పరిశ్రమ ముందుంది. మన దగ్గర కూడా ఈ ట్రెండ్ ఇటీవలే ఊపందుకుంది కానీ దానికి పునాది వేసింది మల్లువుడ్ అనే చెప్పాలి. ఇటీవలే మార్చి 19 ‘ఆడు 3: వన్ లాస్ట్ రైడ్ – పార్ట్ 1’ అనే మూవీ రిలీజయ్యింది. బడ్జెట్ కేవలం 12 కోట్లకు కొంచెం అటు ఇటు అయ్యింది. దురంధర్ ది రివెంజ్ ప్రభంజనం ముందు ఇది నిలబడదని అందరూ అనుకున్నారు. కట్ చేస్తే ఊహించని ఫలితం వచ్చింది.
కేవలం మొదటి వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లోకి వచ్చి బయ్యర్ వర్గాలకు ఆడు 3 షాక్ ఇచ్చింది. సోమవారానికి ముందే 75 కోట్ల గ్రాస్ వసూలు చేయడం చూసి డిస్ట్రిబ్యూటర్లు ఆశ్చర్యపోతున్నారు. వంద కోట్ల మైలురాయి వైపు పరుగులు పెడుతోందంటే బ్లాక్ బస్టర్ కొట్టినట్టే. అసలు విశేషం కలెక్షన్ కాదు. ఒకపక్క దురంధర్ 2 దెబ్బని పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టారే కాచుకోలేని పరిస్థితిలో జయసూర్య అనే మీడియం రేంజ్ హీరో ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ సాధించడం విశేషం కాక మరేమిటి.
అంతగా ఆడు 3లో ఏముందో అర్థం కావాలంటే కథ మీద ఒక లుక్ వేయాలి. స్టోరీ మూడు కాలాల్లో జరుగుతుంది. 1970 గతం, 2025 వర్తమానం, 2370 భవిష్యత్తు ఇలా టైం ట్రావెల్ చేయిస్తాడు దర్శకుడు మిధున్ మాన్యుయల్ థామస్. స్టార్ డస్ట్ స్టోన్ అనే పురాతనమైన రాయికి అద్భుతమైన శక్తులు ఉంటాయి. వాటి కోసం ఫ్యూచర్ నుంచి ఒక గ్యాంగ్ వస్తుంది. హీరో జయసూర్య బృందం చిక్కుల్లో పడుతుంది. ట్విస్ట్ ఏంటంటే హీరోతో సహా ముఖ్య పాత్రలన్నీ ఇందులో డ్యూయల్ రోల్ చేశాయి.
2 గంటల 50 నిమిషాల నిడివి ఇలాంటి కామెడీ ఫాంటసి థ్రిల్లర్స్ కు ఎక్కువే. అందుకే సెకండాఫ్ ల్యాగ్, ఫోర్స్ గా అనిపించే హాస్యం ఉంటుంది. సీక్వెల్ ఉంది కాబట్టి క్లైమాక్స్ ని హడావిడిగా ముగించిన వైనం కొంత అసంతృప్తి కలిగిస్తుంది. అధిక శాతం నవ్వులు ఢోకా లేకుండా చూసుకున్న మిధున్ మాన్యుయల్ థామస్ ఇంత క్లిష్టమైన బ్యాక్ డ్రాప్ ని హ్యాండిల్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. తెలుగులో డబ్బింగ్ చేసే అవకాశాలు తక్కువే కానీ ఓటిటిలో వ్యూయర్ షిప్ భారీగా ఉండటం పక్కా.
This post was last modified on March 23, 2026 2:27 pm
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…
యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…
తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…
ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనేత. ఇక, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్. తాజాగా మోడీ చిన్ననాటి స్నేహితుడు,…
విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…