ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలను వారం రోజులు ముందుకు జరిపి మార్చి 19 ఫిక్స్ చేసినప్పుడు నిర్మాతలు చెప్పిన వెర్షన్ ఒకటే. టాక్సిక్ వాయిదా పడింది కాబట్టి డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి ఖచ్చితంగా ఉగాదికి పవన్ కళ్యాణ్ సినిమా ఉండాలని, దురంధర్ ది రివెంజ్ హైప్ ఎంత ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ పవన్ కళ్యాణ్ మూవీనే చూస్తారని నొక్కి చెప్పారు. దీంతో ఒత్తిడి అవుతుందని తెలిసినా సరే రిస్క్ తీసుకుని ఆఘమేఘాల మీద విడుదలకు రెడీ చేశారు. కట్ చేస్తే రెండు సినిమాలు వచ్చేశాయి.
ఎవరు ఔనన్నా కాదన్నా ఈ మ్యాటర్ లో అంచనాలు పూర్తిగా రివర్స్ అయ్యాయి. దురంధర్ ప్రభావం కేవలం హైదరాబాద్ లాంటి నగరాలు, జిల్లా కేంద్రాలకే పరిమితమవుతుందనుకుంటే నిన్న ఆదివారం చాలా బిసి సెంటర్లలో రణ్వీర్ సింగ్ సినిమాకు హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఉస్తాద్ షోలు తగ్గించి మరీ కొన్నిచోట్ల దురంధర్ రివెంజ్ కి సర్దుబాటు చేయడం ఓపెన్ సీక్రెట్. డిమాండ్ సప్ప్లై సూత్రాన్ని అనుసరించి డిస్ట్రిబ్యూటర్లు ఇలా చేయడంలో ఎంత మాత్రం ఆశ్చర్యం లేదు.
ఇక్కడ రెండు పరిణామాలు జరిగాయి. ఉస్తాద్ భగత్ సింగ్ ని ఓవర్ ఎస్టిమేట్ చేయడం. దురంధర్ రివెంజ్ ని అండర్ ఎస్టిమేట్ వేయడం. రెండూ తప్పయ్యాయి. దురంధర్ 1 చాలా మంది థియేటర్లలో మిస్సయినప్పటికీ వాళ్లంతా నెట్ ఫ్లిక్స్ లో తెలుగు వెర్షన్ చూశారు. సీక్వెల్ మీద ఆసక్తి పెంచుకున్నారు. అది ఏ స్థాయిలో ఉందనేది ప్రీమియర్లతోనే అర్థమైపోయింది. థియేటర్లు జనాలతో కిక్కిరిసిపోవడం చూసి ట్రేడ్ షాక్ తింది. డబ్బింగ్ వెర్షన్ లేట్ అయినా సరే ఎదురు చూసి మరీ టికెట్లకు ఎగబడ్డారు.
ఇక ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వస్తే క్రేజీ డైరెక్టర్ కాంబో లేకుండా ఉగాదిని సంక్రాంతి రేంజులో ఊహించుకోవడం ఖరీదైన పొరపాటు. ఇది అంత పెద్ద సీజన్ కాదు. సెలవులు ఆదివారంతోనే అయిపోయాయి. మొదటి వారం కాకుండానే పవన్ సినిమా గురించి రకరకాల డిబేట్లు జరుగుతున్నాయి. ఒకవేళ మార్చి 26 వచ్చి ఉంటే బ్లాక్ బస్టరయ్యుండేది కాదు కానీ డ్యామేజ్ అయితే ఖచ్చితంగా తగ్గి ఇంకాస్త మెరుగైన వసూళ్లు వచ్చేవి. అంచనాల త్రాసుని సరిగా పెట్టుకోకపోవడం వల్ల బరువు రాళ్లు కింద పడిపోయాయి.
This post was last modified on March 23, 2026 2:04 pm
ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…
మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…