చాయ్ బిస్కెట్.. సోషల్ మీడియాలో ఉండే తెలుగు జనాలకు ఈ పేరును కొత్తగా పరిచయం చేయాల్సి పని లేదు. యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్ ఫాలో అయ్యే వాళ్లకు ఈ సంస్థ ఎంత వినూత్నమైన కంటెంట్ అందిస్తుందో తెలిసిందే. ‘కలర్ ఫోటో’తో హీరోగా, దర్శకుడిగా మంచి పేరు సంపాదించిన సుహాస్, సందీప్ రాజ్ ఈ సంస్థ అందించిన ఆణిముత్యాలే.
ఇలా ఎంతోమంది కొత్త నటీనటులు, టెక్నీషియన్లు చాయ్ బిస్కెట్ ద్వారా అవకాశాలు అందుకుని పేరు సంపాదించిన వాళ్లే. షార్ట్ పిలిమ్స్ మాత్రమే అనేక రకాల వినూత్న వీడియోలు, ఆర్టికల్స్, పాడ్ కాస్ట్‌లతో చాయ్ బిస్కెట్ తన ప్రత్యేకతను చాటుకుంది. సోషల్ మీడియా సర్కిల్స్‌లో చాయ్ బిస్కెట్ బాగా ఫేమస్. ఇప్పుడీ సంస్థ సినీ రంగ ప్రవేశం చేస్తుండటం విశేషం. చాయ్ బిస్కెట్ కొత్తగా ఓ సినిమాను నిర్మించబోతోంది.
ఆడియో రికార్డింగ్ కంపెనీ లహరి మ్యూజి్క్‌తో కలిసి చాయ్ బిస్కెట్ సినిమాను నిర్మించబోతోంది. చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేసి ఇప్పటికే ఓ సినిమాను పట్టాలెక్కించారు సంస్థ నిర్వాహకులు. ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్న నటీనటులు.. దర్శకుడు, ఇతర టెక్నీషియన్లు అందరూ కొత్త వాళ్లేనట.
లహరితో కలిసి చాయ్ బిస్కెట్ నిర్మిస్తున్న తొలి సినిమా ఫస్ట్ లుక్, ఇతర విశేషాలు 2021 జనవరి 1న బయటికి రాబోతున్నాయి. చాయ్ బిస్కెట్ వాళ్ల షార్ట్ ఫిలిమ్స్, ఇతర వీడియోలను బట్టి చూస్తే సినిమా కూడా ప్రయోగాత్మకంగా, సరికొత్తగా ఉంటుందని ఆశించవచ్చు. ఈ ఒక్క సినిమాతో ఆగకుండా చాయ్ బిస్కెట్, లహరి భాగస్వామ్యంలో మున్ముందూ చాలా సినిమాలు రాబోతున్నాయట. అందరూ కొత్త వాళ్లతోనూ ఈ సినిమాలు తీస్తామని వాళ్లు చెబుతుండటం విశేషం.
This post was last modified on December 23, 2020 4:00 pm
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…