Movie News

గద్దర్ అవార్డులు.. భలే భలే

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో క్రమం తప్పకుండా ఎన్నో ఏళ్ల నుంచి ఇస్తూ వచ్చిన నంది అవార్డులకు.. రాష్ట్ర విభజన తర్వాత బ్రేక్ పడింది. అప్పట్లో ఈ అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించారు. కానీ ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక ప్రభుత్వ అవార్డులకు ప్రాధాన్యం తగ్గిపోయింది. తెలంగాణ ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదు. ఏపీ సర్కారు కూడా ఈ అవార్డులను విస్మరించింది.

మధ్యలో కొన్నేళ్లు టీడీపీ ప్రభుత్వం అవార్డులు ఇచ్చినా.. తర్వాత బ్రేక్ పడింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణలో గద్దర్ అవార్డులను ప్రవేశపెట్టి కొన్నేళ్లకు కలిపి ఒకేసారి అవార్డులు ఇచ్చారు. ఇకపైనా ఈ అవార్డులను కొనసాగించే ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వం.. ఇప్పుడు 2025 సంవత్సరానికి పురస్కారాలు ప్రకటించింది.

2025లో రిలీజైన వాటితో పాటు.. ఆ సంవత్సరం సెన్సార్ అయిన చిత్రాలకు కూడా కలిపి అవార్డులు ప్రకటించారు. ఏదో మొక్కుబడిగా అవార్డులు ఎంపిక చేసినట్లు.. రెకమండేషన్లతో ఇచ్చినట్లు కాకుండా.. బాగా కసరత్తు చేసి, వివాదాలు తలెత్తకుండా అర్హత ఉన్న సినిమాలు, ఆర్టిస్టులకు అవార్డులు ఇచ్చారని లిస్ట్ చూస్తే అర్థమవుతుంది. మరి ఆ వివరాలేంటో చూసేద్దామా?

2025 సంవత్సరానికి గద్దర్ అవార్డుల వివరాలు

ఉత్తమ నటుడు – నాగ చైతన్య (తండేల్‌)
ఉత్తమ నటి – రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్‌)
ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్ రాంబాయి
ఉత్తమ ద్వితీయ చిత్రం – దండోరా
ఉత్తమ తృతీయ చిత్రం – ది గ్రేట్ ప్రి వెడ్డింగ్‌ షో
నేషనల్‌ ఇంటిగ్రిటీ సినిమా – తండేల్‌
ఉత్తమ పర్యావరణ చిత్రం – ఇగ్వా
ఉత్తమ డెబ్యూ ఫీచర్‌ ఫిల్మ్ – లిటిల్‌ హార్డ్స్
ఉత్తమ వినోదాత్మక చిత్రం – సంక్రాంతికి వస్తున్నాం
ఉత్తమ సోషల్‌ మెసేజ్‌ చిత్రం – కోర్టు
ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్ మూవీ – మిరాయ్‌
ఉత్తమ బాలల చిత్రం – అనగనగనా
ఉత్తమ దర్శకుడు – సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ సపోర్టింగ్‌ నటుడు – శివాజీ (దండోరా)
ఉత్తమ సపోర్టింగ్‌ నటి- భూమిక (యుఫోరియా)
ఉత్తమ సంగీత దర్శకుడు – మార్క్ కె రాబిన్‌ (దండోరా)
ఉత్తమ నేపథ్య గాయకుడు – అనురాగ్‌ (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ నేపథ్య గాయని – సాహితి చాగంటి (కన్నప్ప)
ఉత్తమ హాస్యనటుడు – కృష్ణ తేజ (జిగ్రీస్‌)
ఉత్తమ బాలనటుడు – రోహన్ ‌ రాయ్‌ (ది గ్రేట్ ప్రి వెడ్డింగ్‌ షో)
ఉత్తమ కథా రచయిత – గుణశేఖర్‌ (యుఫోరియా)
ఉత్తమ స్క్రీన్‌ ప్లే రైటర్‌ – అనిల్‌ రావిపూడి
ఉత్తమ గేయ రచయిత – నందకిశోర్‌ (కుబేర)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ – కార్తిక్‌ ఘట్టమనేని (మిరాయ్‌)
ఉత్తమ ఎడిటర్‌- శ్రీకర్‌ ప్రసాద్‌ (మిరాయ్‌)
ఉత్తమ ఆడియోగ్రాఫర్‌ – ఎం.ఆర్‌ రాధాకృష్ణన్‌ కిష్కిందపురి
ఉత్తమ కొరియోగ్రాఫర్‌ – గిర గిర గిర (ఛాంపియన్)
ఉత్తమ ఆర్ట్ డైరక్టర్‌ – తోట తరణి (ఛాంపియన్‌)
ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్ – గోవిందరాజు (అఖండ-2)
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ – ఛాంపియన్‌ – చంద్రకాంత్‌
ఉత్తమ స్పెషల్‌ జ్యూరీ ఫిల్మ్ – 23
ఉత్తమ స్పెషల్ జ్యూరీ మేల్‌ యాక్టర్‌ – చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ స్పెషల్ జ్యూరీ ఫిమేల్ యాక్ట్రెస్ – అనంతిక (8 వసంతాలు)
ఉత్తమ స్పెషల్‌ జ్యూరీ హీరో – రోషన్‌ (ఛాంపియన్‌)

This post was last modified on March 7, 2026 3:01 pm

Share

Recent Posts

కాంగ్రెస్ లో క్రమశిక్షణ తప్పదా?

మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…

4 hours ago

మీరు టికెట్ ఇవ్వడానికి ఎవరు ఉండరు జగన్

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…

7 hours ago

రోమాంచకం… సరిపోతుందా సమయం

టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…

8 hours ago

హనుమాన్ దర్శకుడి హవా మొదలైంది

‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…

8 hours ago

అజ్ఞాతవాసి… పుచ్చుకున్నదంతా ఇచ్చేసిన త్రివిక్రమ్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…

8 hours ago

పంజాని మరో ఆరెంజ్ చేసేలా ఉన్నారు

ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…

9 hours ago