Movie News

ఎట్టకేలకు నిద్ర లేచిన దురంధర్

మార్చి నెలలో వస్తాయనుకున్న కొన్ని క్రేజీ పాన్ ఇండియా సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి వాయిదా పడిపోయాయి. చివరి వారానికి షెడ్యూల్ అయిన ది ప్యారడైజ్, పెద్ది కొత్త డేట్లు చూసుకున్నాయి. ‘డెకాయిట్’ సైతం రేసు నుంచి తప్పుకుంది. ఇటీవలే ‘టాక్సిక్’ లాంటి పెద్ద సినిమా సైతం వెనక్కి వెళ్లిపోయింది.

దీంతో పాన్ ఇండియా ప్రేక్షకుల ఆశలన్నీ ‘దురంధర్-2’ మీదే నిలిచాయి. ఐతే ఈ సినిమా కూడా వాయిదా పడుతుందేమో అని తాజాగా జనాలకు భయం పట్టుకుంది. రిలీజ్ దగ్గర పడుతున్నా ప్రమోషన్లు లేకపోవడం.. ట్రైలర్ లాంచ్ చేయకపోవడమే ఇందుక్కారణం.

నిన్నట్నుంచి సోషల్ మీడియాలో ‘దురంధర్-2’ వాయిదా గురించి జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. ట్రైలర్ ఎక్కడ.. ప్రమోషన్లు ఏవీ అంటూ టీంను వాయించేస్తున్నారు సినీ అభిమానులు. ఆదిత్య ధర్ అండ్ టీం మౌనంగా ఉండిపోవడంతో అనుమానాలు మరింత పెరిగిపోయాయి. సినిమా వాయిదానే అని అందరూ ఒక నిర్ణయానికి వచ్చేస్తున్న సమయంలో టీం స్పందించింది.

‘దురంధర్-2’ ట్రైలర్‌ను శనివారం లాంచ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. అంతే కాక మార్చి 19నే ఈ చిత్రం విడుదలవుతుందని కూడా స్పష్టం చేశారు. ఈసారి కేవలం హిందీ వరకే కాకుండా తెలుగు, తమిళం సహా పలు ప్రాంతీయ భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

‘దురంధర్: ది రివెంజ్’ పేరుతో రానున్నఈ సినిమాకు ట్రైలర్‌ను కూడా బహు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. గత డిసెంబరు 5న పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ‘దురంధర్’ బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు రేపింది.

రెండు నెలల థియేట్రికల్ రన్‌తో ఏకంగా రూ.1300 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. ‘దురంధర్-2’ మీద అంచనాలు మామూలుగా లేవు. ఫస్ట్ పార్ట్ లాగే ఉంటే ఇది రూ.2 వేల కోట్ల మైలురాయిని కూడా అందుకునే అవకాశాలను కొట్టిపారేయలేం. హంజా అనే స్పై పాత్రలో రణ్వీర్ సింగ్ ఈసారి ఇంకెన్ని విన్యాసాలు చేస్తాడా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు దేశ విదేశాల్లో 19న రికార్డు రిలీజ్ దక్కబోతోంది.

This post was last modified on March 6, 2026 2:55 pm

Share

Recent Posts

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…

3 hours ago

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

4 hours ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

5 hours ago

రాజమౌళిని ఫాలో అవుతున్న రణబాలి

సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…

5 hours ago

దాదాకున్న సమయం తక్కువే కానీ

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…

6 hours ago

రణబాలి… దర్శకుడి క్లారిటీ సూపర్

ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…

7 hours ago