ఎట్టకేలకు మళ్లీ తెలుగు రాష్ట్రాల థియేటర్లలో సందడి కనిపించనుంది. ఈ నెల 25న క్రిస్మస్ కానుకగా విడుదల కానున్న సాయిధరమ్ తేజ్ సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’ బాగానే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాకు బుకింగ్స్ ప్రోత్సాహకరంగా ఉన్నాయి. 50 పర్సంట్ ఆక్యుపెన్సీతో అయినా సరే.. మంచి వసూళ్లే వచ్చేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సంక్రాంతికి రవితేజ మూవీ ‘క్రాక్’ రిలీజ్ ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే.
ఆ చిత్రాన్ని జనవరి 14న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. సంక్రాంతికి వేరే సినిమాలు సైతం షెడ్యూల్ అయ్యాయి కానీ.. మిగతా చిత్రాల నిర్మాతలు రిలీజ్‌కు ధైర్యం చేసేలా కనిపించలేదు. ఐతే ‘క్రాక్’ టీం మాత్రం విడుదలకు రెడీ అయిపోయింది. దీంతో ఆ ఒక్క సినిమానే సంక్రాంతికి సందడి చేస్తుందేమో అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు రామ్ మూవీ ‘రెడ్’ సైతం సంక్రాంతికి విడుదల ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది.
‘రెడ్’ను జనవరి 15న విడుదల చేయనున్నారట. ‘రెడ్’ గురించి హాట్ అప్ డేట్ అంటూ రామ్ ఇప్పటికే ట్విట్టర్లో సంకేతాలిచ్చాడు. అధికారిక ప్రకటన రాబోతోంది. 15న ‘రెడ్’ రిలీజ్ అన్నదే ప్రకటన అని సమాచారం. తమిళ హిట్ ‘తడం’కు రీమేక్‌గా తెరకెక్కిన ‘రెడ్’కు రామ్ ఫేవరెట్ డైరెక్టర్లో ఒకడైన కిషోర్ తిరుమల దర్శకత్వం వహించాడు.
ఇంతకుముందు వీళ్లిద్దరి కలయికలో వచ్చిన తొలి సినిమా ‘నేను శైలజ’ సూపర్ హిట్టయింది. తర్వాత ‘ఉన్నది ఒకటే జిందగీ’ ఓ మాదిరిగా ఆడింది. ఇప్పుడు ఇద్దరూ రీమేక్‌తో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రామ్ చివరి సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్‌బస్టర్ కావడం ‘రెడ్’కు కలిసొచ్చింది. పరిమిత బడ్జెట్లో తెరకెక్కిన ఈ సినిమాకు డిజిటల్, శాటిలైట్, డబ్బింగ్ హక్కుల రూపంలో ఇప్పటికే పెట్టుబడి వెనక్కి వచ్చేసిందట. థియేట్రికల్ వసూళ్ల ద్వారా వచ్చేదంతా లాభమే అంటున్నారు.
This post was last modified on December 21, 2020 3:45 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…