Movie News

ఫిబ్రవరి నెల ఎందుకింత డ్రైగా ఉంది

సంక్రాంతి తర్వాత మళ్ళీ అదే స్థాయిలో కాదు కానీ అందులో సగం ఊపు కూడా ఫిబ్రవరిలో కనిపించడం లేదు. సంతోష్ శోభన్ ‘ఫ్రెండ్లీ కపుల్’కి పాజిటివ్ టాక్ వచ్చినా గత ఇరవై నాలుగు గంటల్లో బుక్ మై షోలో అమ్ముడుపోయిన టికెట్లు సుమారు 19 వేల పైచిలుకు మాత్రమే. మిక్స్డ్ నుంచి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ‘ఫంకీ’ కూడా ఇదే నెంబర్లు నమోదు చేయడం గమనార్హం.

సహజంగానే ఫిబ్రవరిని మేకర్స్ డ్రై మంత్ గా భావిస్తారు. పదో తరగతి, ఇంటర్ మీడియట్ పరీక్షలు దగ్గరగా ఉంటాయి కాబట్టి థియేటర్ ఆక్యుపెన్సీలు కొంచెం తక్కువగా ఉంటాయి. అలాని పూర్తిగా తీసిపారేసే నెల కాదు. ఎందుకో అర్థం కావాలంటే కొంచెం వెనక్కు వచ్చేలా.

గత ఏడాది వంద కోట్ల క్లబ్బులో చేరిన నాగచైతన్య ‘తండేల్’ వచ్చింది ఫిబ్రవరిలోనే. అంతకు ముందు ధనుష్ సార్, వైష్ణవ్ తేజ్ ఉప్పెన, వరుణ్ తేజ్ తొలిప్రేమ, అడవి శేష్ క్షణం, నితిన్ భీష్మ, మమ్ముట్టి యాత్ర, సిద్ధూ జొన్నలగడ్డ డీజే టిల్లు, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, విశ్వక్ సేన్ హిట్ 1 ఫస్ట్ కేస్ మొదలైన సూపర్ హిట్లన్నీ ఈ సీజన్ లో వచ్చి కమర్షియల్ గా సక్సెస్ అందుకున్నవే.

వీటిలో కరోనా ముందు, తర్వాత వచ్చినవి అన్నీ ఉన్నాయి. అలాంటప్పుడు 2026 ఏదో స్పెషల్ కేసుగా చెప్పలేం. సమస్యల్లా అన్ని వర్గాలను ఆకట్టుకునే యునానిమస్ కంటెంట్ రాకపోవడం. కపుల్ ఫ్రెండ్లీని ఆదరిస్తుంది యువతనే కానీ ఫ్యామిలీస్ కాదు.

ఉన్నంతలో ఆరంజ్, మనసంతా నువ్వే రీ రిలీజులు రెండు మూడు రోజుల హడావిడితో కలెక్షన్లు రాబడితే లవ్ స్టోరీ ఆదరణకు నోచుకోలేదు. ఇప్పుడు రాబోయే వారం రిలీజవుతున్న హే బలవంత్ లాంటివి కూడా మీడియం రేంజ్ లో వచ్చేవే కనక టాక్ చాలా కీలకం కానుంది.

ఇప్పుడప్పుడే టయర్ 1 స్టార్లు నటించిన పెద్ద సినిమాలు లేకపోవడంతో వీక్ డేస్ థియేటర్ల ఆక్యుపెన్సీలు మరీ అన్యాయంగా పడిపోతున్నాయి. వారాంతాలు జనాలు వస్తున్నా సోమ నుంచి గురువారం వరకు కొన్ని షోలు జనాలు లేక ఆలో లక్ష్మణా అంటున్నాయి. మరి అనూహ్యంగా ప్రేక్షకులను రాబట్టే మూవీగా ఏవి నిలబడతాయో చూడాలి.

This post was last modified on February 16, 2026 4:07 pm

Share

Recent Posts

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

7 minutes ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

2 hours ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

2 hours ago

కళ్యాణ్ గుండె ధైర్యం గట్టిదే

అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…

2 hours ago

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

4 hours ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

4 hours ago