మాచో స్టార్ గోపీచంద్ కంబ్యాక్ కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. పదే పదే రొటీన్ మాస్ తో బాక్సాఫీస్ వద్ద ఒకే ఫలితం అందుకుంటున్న ఈ మాస్ హీరో ఎట్టకేలకు దారిలో పడినట్టు కనిపిస్తోంది. ఘాజి అటాక్, అంతరిక్షం ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో భారీ పీరియాడిక్ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
దీనికి ‘కాలాగ్ని’ టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ దాదాపు లాకైనట్టే. గతంలో శూల లాంటివి ప్రతిపాదనలో ఉండేవి కానీ ఫైనల్ గా టీమ్ మొత్తం కాలాగ్ని వైపే మొగ్గు చూపినట్టు తెలిసింది. అయితే ఇందులో బోలెడు విశేషాలు ఉండబోతున్నాయి.
కాలాగ్నిలో గోపిచంద్ యుద్ధవీరుడిగా ఇప్పటిదాకా చేయని పాత్రలో కనిపించబోతున్నారు. చరిత్రలో మరుగునపడిపోయిన ఒక చారిత్రాక ఘట్టం మీద సంకల్ప్ రెడ్డి పరిశోధన చేసి ఈ స్క్రిప్ట్ రాసుకున్నారట. మైథాలజీ, దేశభక్తి, హిస్టరీ ఇలా మూడు విభిన్న అంశాలను మేళవించిన తీరు సరికొత్తగా ఉంటుందని వినికిడి.
ముఖ్యంగా పాతిక రోజుల నుంచి షూట్ చేస్తున్న క్లైమాక్స్ ఎపిసోడ్ ఎప్పటికీ చెప్పుకునే స్థాయిలో వస్తోందట. రాత్రి వేళల్లో చాలా రిస్క్ మధ్య దీని చిత్రీకరణ జరుగుతోంది. వార్ ఎపిసోడ్లు, ఛేజులు మీద సంకల్ప్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల అవి చాలా బాగా వచ్చాయని అంటున్నారు .
ట్రెండ్ కు తగ్గట్టు బ్యాక్ డ్రాప్ ఎంచుకున్న గోపీచంద్ కు దీని సక్సెస్ చాలా కీలకం. విడుదల తేదీ ఇంకా ఖరారు చేయలేదు. పోటీ లేకుండా సోలో రిలీజ్ కోసం వివిధ ఆప్షన్లను చూస్తున్నారు. వ్యక్తిగతంగా కూడా గోపీచంద్ ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డాడు.
కాలాగ్ని టైటిల్ చూస్తుంటే కంటెంట్ ఏదో పవర్ ఫుల్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు అనుదీప్ దేవ్ సంగీతం సమకూరుస్తున్నాడు. మరి గోపిచంద్ కోరుకున్న బ్రేక్ దీంతో అయినా దక్కుతుందేమో చూడాలి. రితిక నాయక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ బ్యాక్ డ్రాప్ ఏడవ శతాబ్దం నుంచి మొదలవుతుందట.
This post was last modified on February 14, 2026 10:20 pm
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…