Movie News

బాలయ్య మీద ఒత్తిడి పని చేయదు

సోషల్ మీడియా ప్రచారాలు కొన్ని భలే విచిత్రంగా ఉంటాయి. వాటిలో బాలయ్య కేవలం నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు రిలీజ్ చేస్తారనేది ఒకటి. వీరసింహారెడ్డి కాంబినేషన్ రిపీట్ చేస్తూ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందబోయే కమర్షియల్ ఎంటర్ టైనర్ వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళబోతున్న సంగతి తెలిసిందే.

ముందు అనుకున్న డ్యూయల్ రోల్ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ కాకుండా ఈసారి పూర్తిగా కథను మార్చుకుని యాక్షన్ డ్రామా వైపు మొగ్గు చూపారు. బడ్జెట్ పరంగా రిస్క్ లేకుండా ప్లానింగ్ చేసుకుంటున్నారు. అయితే దీన్ని భగవంత్ కేసరి లాగా దసరాకు విడుదల చేస్తారట.

సరే ఇది సాధ్యమవుతుందని అనుకుందాం. తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా తీసేసి 2027 సంక్రాంతి బరిలో దింపుతారట. దీనికి ఎంత మాత్రం ఛాన్స్ లేదని చెప్పాలి. ఎందుకంటే సమాంతరంగా రెండు సినిమాలు చేస్తూ ఒత్తిడి తీసుకోవడానికి బాలయ్య ఇష్టపడరు. అసలా అవసరం కూడా లేదు.

మలినేని సినిమా అంత ఆషామాషీగా రెండు మూడు నెలల్లో తీసేది కాదు. ఒకవేళ దసరా టార్గెట్ అందుకున్నా ఆ తర్వాత హరీష్ శంకర్ ది చేయడానికి టైం అయితే పడుతుంది. అలాంటప్పుడు రెండు బ్యాక్ టు బ్యాక్ తక్కువ స్పేస్ లో రావడం జరగని పనని చెప్పాలి. ఇది వట్టి పుకారే.

ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే బాలయ్య ప్రస్తుతం కమిట్ మెంట్ ఇచ్చింది గోపీచంద్ మలినేనికి ఒక్కటే. ఆ తర్వాత హరీష్ శంకర్ ది ఉంటుందా లేదానేది పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఆదిత్య 999 మ్యాక్స్ కూడా బాలయ్య లిస్టులో ఉంది.

స్వీయ దర్శకత్వంలో సాధ్యం కాకపోతే ఆ బాధ్యతను క్రిష్ లాంటి వాళ్లకు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. అనిల్ రావిపూడి భగవంత్ కేసరి ప్రీక్వెల్ మీద ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిషత్తులో జరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సో బాలయ్య ఫ్యాన్స్ రిలాక్స్ అయిపోయి పూర్తి ఫోకస్ ని మలినేని మూవీ మీదే పెట్టొచ్చు.

This post was last modified on February 13, 2026 10:44 pm

Share

Recent Posts

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

16 minutes ago

గరివిడి లక్ష్మి చేస్తోంది పెద్ద సాహసమే

దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…

39 minutes ago

అద్భుత ప్రయోగాల నిలయం ‘సింగీతం’

లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…

1 hour ago

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

4 hours ago

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

5 hours ago

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

12 hours ago