Movie News

సెంటిమెంట్ ఫాలో కానున్న జైలర్ 2

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న జైలర్ 2 షూటింగ్ పూర్తి కావొస్తోంది. చెన్నై మీడియా వర్గాలు జూన్ విడుదలని ఊదరగొడుతున్నాయి కానీ రజని టీమ్ మాత్రం సెంటిమెంట్ కే ఓటు వేయనుందని సమాచారం.

అంటే ఆగస్ట్ రెండో వారంలో ఇండిపెండెన్స్ డేని లక్ష్యంగా చేసుకుని ఆగస్ట్ 12 లేదా 14 రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతోందట. మూడేళ్ళ క్రితం 2023లో జైలర్ మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆగస్ట్ 10. ఆ టైంలో ఎన్ని రికార్డులు బద్దలయ్యాయో చెప్పనక్కర్లేదు. తెలుగు డబ్బింగ్ వెర్షన్ సైతం ఊహించనంత పెద్ద స్థాయిలో బ్లాక్ బస్టర్ సాధించింది.

సో సీక్వెల్ కూడా అదే సమయమైతే బాగుంటుందని భావించి ఆ మేరకు లాక్ చేయొచ్చని వినికిడి. ఇంత దూరం డేట్ పెట్టుకోవడానికి కారణం లేకపోలేదు. కీలకమైన షారుఖ్ ఖాన్ క్యామియో తాలూకు షూట్ ఇంకా పూర్తి కాలేదు. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్ కు సంబంధించిన కొన్ని సీన్స్ బ్యాలన్స్ ఉన్నాయట.

ఇవన్నీ కొలిక్కి తెచ్చి పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసేలోపు వేసవి అయిపోతుంది. అలాంటప్పుడు జూన్ అని ఒత్తిడి పెట్టుకుంటే బిజినెస్ పరంగా బజ్ పరంగా చాలా పెద్ద రిస్క్ అవుతుంది. అందుకే నిదానమే ప్రధానం సూత్రాన్ని పాటిస్తూ ఆగస్ట్ కు వెళ్లినట్టు తెలిసింది.

కూలి తర్వాత రజినీకాంత్ కు హిట్టవ్వాల్సిన బాధ్యత జైలర్ 2 మీద ఉంది. అదొక్కటే కాదు రజని కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కబోయే మల్టీస్టారర్ కూడా నెల్సన్ దిలీప్ కుమార్ కే ఇవ్వబోతున్న నేపథ్యంలో దీని ఫలితం కీలకం కానుంది.

కొడుకు చనిపోయాక ముత్తువేల్ పాండియన్ జీవితంలో ఏమేం జరిగాయనే పాయింట్ మీద జైలర్ 2లో యాక్షన్ డోస్ ఎక్కువ ఉండబోతోందట. క్రైమ్, విలన్లు కూడా మారబోతున్నారు. ఆ వారంలో వేరే తమిళ తెలుగు ప్యాన్ ఇండియా సినిమాలు ఏవీ పోటీకి లేవు. ఆగస్ట్ 21 నాని ప్యారడైజ్ ఉన్న నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద స్వాతంత్ర దినోత్సవ పోటీ రసవత్తరంగా ఉండబోతోంది.

This post was last modified on February 13, 2026 10:41 pm

Share

Recent Posts

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

20 minutes ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

1 hour ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

2 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

2 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

2 hours ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

4 hours ago