Movie News

వరప్రసాద్ గారు కాస్త ఊపిరినిచ్చారు

సంక్రాంతి సినిమాల్లో బ్లాక్ బస్టర్ రన్ తో రికార్డులు సృష్టించిన మన శంకరవరప్రసాద్ గారు తర్వాత బాగా స్లో అయిపోయింది. పండగ మూడ్ నుంచి బయటికి వచ్చిన ప్రేక్షకులు, సెలవులు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎవరికి వారు బిజీ కావడంతో థియేటర్లు క్రమంగా బోసి పోవడం మొదలయ్యాయి.

అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారి లాంటి హిట్లు సైతం ఎదురీదక తప్పని పరిస్థితి నెలకొంది. నిన్నా మొన్న కొత్త వీకెండ్ కాస్త తెరిపినిచ్చింది. గత ఇరవై నాలుగు గంటల్లో చిరంజీవి మూవీకి బుక్ మై షోలో నలభై వేల దాకా అడ్వాన్స్ టికెట్లు అమ్ముడుపోగా నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ కూడా మంచి నెంబర్లు నమోదు చేశారు.

ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల మన శంకరవరప్రసాద్ గారుకి అదనపు స్క్రీన్లు జోడించారు. ఇవాళ్టి నుంచి పరిస్థితి మళ్ళీ మొదటికే రానుంది. హాళ్లు తిరిగి ఖాళీ కాబోతున్నాయి. కొత్తగా రిలీజైన వాటిలో అంతో ఇంతో బజ్ ఉన్న ఓం శాంతి శాంతి జనాలను ఆకట్టుకోవడంలో విఫలం కావడంతో మరోసారి డ్రై వీక్ ఎదురయ్యింది.

ఇక సంక్రాంతి సినిమాలకు చివరి ఓవర్ అయ్యిందని చెప్పాలి. నారి నారి నడుమ మురారి ఫిబ్రవరి 4, రాజా సాబ్ ఫిబ్రవరి 6, మన శంకరవరప్రసాద్ గారు ఫిబ్రవరి 11, అనగనగా ఒక రాజు ఫిబ్రవరి 13 ఓటిటిలో రావడం దాదాపు ఖరారట. మొదటి రెండు సినిమాల అనౌన్స్ మెంట్స్ అఫీషియల్ గా వచ్చేశాయి కూడా.

ఇక భర్త మహాశయులకు విజ్ఞప్తి డేట్ ఒకటి తెలియాల్సి ఉంది. ఫిబ్రవరి 14 నుంచి తిరిగి కొత్త సినిమాల హడావిడి మొదలు కానుంది. కాకపోతే టయర్ 1, 2 లీగ్ లో ఉన్న హీరోల రిలీజులేవి లేకపోవడం బయ్యర్ వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది. కనీసం వారం పది రోజులు హౌస్ ఫుల్స్ చేయించే హిట్టొకటి పడాలని కోరుకుంటున్నారు కానీ అది ఎంత మేరకు సాధ్యమవుతుందో చూడాలి.

విశ్వక్ సేన్, సంతోష్ శోభన్ లాంటి వాళ్ళు తమ కంటెంట్ తో యునానిమస్ టాక్ తెచ్చుకుంటే తిరిగి టికెట్ కౌంటర్లకు జోష్ తెప్పించవచ్చు. ఆయా యూనిట్లు ప్రమోషన్ల వేగాన్ని పెంచే పనిలో బిజీగా ఉన్నాయి. చూడాలి ఎవరు గెలుస్తారో.

This post was last modified on February 2, 2026 12:17 pm

Share

Recent Posts

పీకేతో టచ్ లో సాయిరెడ్డి?

ప‌రివ‌ర్త‌న రాజ‌నీతి పార్టీ(పీఆర్ పీ) పేరుతో సొంత పార్టీని స్థాపించుకున్న వైసీపీ మాజీ నేత‌, రాజ్య‌స‌భ మాజీ ఎంపీ వేణుంబాకం…

21 minutes ago

`క‌రువు`లో ఉన్నాం.. 30 వేల కోట్లివ్వండి

తెలంగాణ రాష్ట్రంలో ఎల్-నినో ప్రభావం వల్ల నెలకొన్న వర్షాభావం, కరువు పరిస్థితుల నేప‌థ్యంలో రాష్ట్రాన్ని, రైతులను ఆదుకునేందుకు కేంద్రం నుంచి…

2 hours ago

చంద్రబాబు దార్శనికతకు నిదర్శనం

తిరుమల అంటే కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే ఈ పుణ్యక్షేత్రంలో…

3 hours ago

వైసీపీ ట్రాప్‌.. చిక్కుకుపోయిన టీడీపీ..?

రాష్ట్ర వ్యాప్తంగా కాదుకానీ.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల విష‌యంలో వైసీపీ స్థానిక నేత‌లు ప‌న్నిన వ్యూహానికి టీడీపీ…

6 hours ago

అస‌దుద్దీన్ నేతృత్వంలో కొత్త `కూట‌మి`

దేశంలో ప్ర‌స్తుతం జాతీయ స్థాయిలో రెండు కూట‌ములు కొన‌సాగుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోనిఎన్డీయే, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో `ఇండియా` కూట‌ములు ఉన్నాయి.…

8 hours ago

కాకినాడ‌, శ్రీకాకుళంపై పట్టు వదలని పవన్!

ఇటీవ‌ల జ‌రిగిన మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో మిగిలిపోయిన కార్పొరేష‌న్ స్థానాల‌కు, అలానే మునిసిపాలిటీల‌కు త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో…

9 hours ago