Movie News

‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత ఏదో ఆశిస్తే..

గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ ఊహించని స్థాయిలో వసూళ్లు రాబట్టింది. పవన్ కళ్యాణ్ సినిమా ‘ఓజీ’ వచ్చే వరకు గత ఏడాదికి ఇదే హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. అంత పెద్ద హిట్ సినిమాలో కథానాయికగా చేసిన ఐశ్వర్య రాజేష్‌కు.. ఆ తర్వాత తెలుగులో ఆశించిన అవకాశాలు మాత్రం రాలేదు.

వెంకీకి జోడీగా ఆమె కీలక పాత్రలో చాలా బాగా నటించింది. అందం, అభినయం రెంటితోనూ ఆకట్టుకుంది. ముఖ్యంగా తన కామెడీ టైమింగ్‌ అందరినీ ఆకట్టుకుంది. వెంకీ పక్కన బాగా సూటైన నేపథ్యంలో.. సీనియర్ హీరోల సరసన అయినా ఆమెకు ఛాన్సులు వస్తాయనుకున్నారు. కానీ అలా జరగలేదు. చాలా గ్యాప్ తర్వాత ఐశ్వర్య.. యువ నటుడు తిరువీర్ సరసన ‘ఓ సుకుమారి’ అనే చిన్న సినిమాలో నటిస్తోందంతే.

‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత వరుసగా తనకు పెద్ద సినిమాల్లో అవకాశాలు వస్తాయని.. పెద్ద హీరోల సరసన నటిస్తానని ఆశించినట్లు ఐశ్వర్య ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అలా జరగకపోవడం కొంత నిరాశ కలిగించినప్పటికీ.. తనకు నచ్చిన పాత్రల్లో నటిస్తూ సంతోషంగానే ఉన్నానని ఐశ్వర్య చెప్పింది.

హీరోయిన్‌గా ఐశ్వర్య చేయగలదా.. అని తెలుగు దర్శకులు, హీరోలు, నిర్మాతలు అనుకుంటున్నారేమో అని ఆమె కామెంట్ చేసింది. అనుకున్న స్థాయిలో అవకాశాలు రాకపోయినా.. తన వద్దకు వచ్చిన కథా బలమున్న సినిమాలు, పాత్రలతో ఆనందంగా ఉన్నట్లు ఆమె చెప్పింది.

తాను కెరీర్ ఆరంభంలో, 21 ఏళ్లకే ‘కాకాముట్టై’ చిత్రంలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించానని.. కాబట్టి ఎలాంటి రోల్ చేయడానికైనా తాను సిద్ధంగా ఉంటానని ఆమె స్పష్టం చేసింది. ఒకప్పటి తెలుగు నటుడు రాజేష్ కుమార్తె అయిన ఐశ్వర్య అచ్చమైన తెలుగమ్మాయే.

ఐతే తండ్రి ఉండగా కుటుంబంతో కలిసి చెన్నైలో సెటిలైన ఐశ్వర్య.. ఆయన మరణానంతరం కూడా అక్కడే ఉండిపోయింది. తమిళ సినిమాల ద్వారానే నటిగా పరిచయం అయి.. ఆ తర్వాత తెలుగులో కౌసల్యా కృష్ణమూర్తి, రిపబ్లిక్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి చిత్రాల్లో నటించింది.

This post was last modified on January 30, 2026 11:16 am

Share

Recent Posts

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

1 hour ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

3 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

3 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

4 hours ago

తమిళ రాజకీయాల్లోకి ఇంకో స్టార్?

జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…

4 hours ago

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

5 hours ago