దర్శకుడు గుణశేఖర్ అంటే మూవీ లవర్స్ కు వెంటనే గుర్తొచ్చే పేర్లు ఒక్కడు, చూడాలని ఉంది. భారీతనానికి కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన ఈ బ్లాక్ బస్టర్స్ మహేష్ బాబు, చిరంజీవి కెరీర్లకు ఎంత ప్లస్ అయ్యాయో మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత గుణశేఖర్ ఎన్నో గ్రాండియర్స్ తీశారు కానీ అవేవి పైన చెప్పిన వాటి స్థాయిలో సగం కూడా కాలేకపోయాయి.
అర్జున్, రుద్రమదేవి కొంచెం పర్వాలేదనిపిస్తే వరుడు నుంచి మొన్నటి శాకుంతలం వరకు ఆయన తిన్న దెబ్బలు అన్ని ఇన్ని కావు. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిగా ప్రయత్నాలు ఆపడం లేదు. తన కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరి 6 విడుదల కానుంది.
ఈ సందర్భంగా జరుగుతున్న ప్రమోషన్ల భారం మొత్తం నిర్మాత కం దర్శకుడిగా గుణశేఖర్ తన భుజాల మీద వేసుకున్నారు. ట్రైలర్ వచ్చి రోజులు దాటిపోయింది కానీ ఇంకా బజ్ పెరగలేదు. ఈసారి చాలా సెన్సిటివ్ కాన్సెప్ట్ తీసుకున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ క్లాస్, మాస్ సంబంధం లేకుండా ఒక సీరియస్ ఇష్యూని కమర్షియల్ ఫ్లేవర్ తో ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేశారు.
ఒక్కడులో హీరోయిన్ గా నటించిన భూమికకు తల్లి పాత్ర ఇచ్చారు. దురంధర్ లాంటి ఇండస్ట్రీ హిట్ లో నటించిన సారా అర్జున్ ని లీడ్ రోల్ కు తీసుకున్నారు. మిగిలిన క్యాస్టింగ్ లో అధిక శాతం కొత్త కుర్రాళ్లే ఉన్నారు.
డ్రగ్స్ ద్వారా యువత జీవితాలు ఎంత దారుణంగా తలకిందులవుతాయో చెప్పే ప్రయత్నమే యూఫోరియా. కాకపోతే మెసేజ్ తరహాలో కాకుండా యాక్షన్, థ్రిల్ మిక్స్ చేసి కొత్తగా చెప్పబోతున్నారు. కాన్సెప్ట్ ఎంత మంచిదే అయినా జనాన్ని థియేటర్లకు రప్పించడం పెద్ద సవాల్ గా మారిపోయిన ట్రెండ్ లో గుణశేఖర్ దీన్ని డూ ఆర్ డై తరహాలో టేకప్ చేసి థియేటర్ల దాకా తీసుకొచ్చారు.
సంక్రాంతి నుంచి ఎంటర్ టైన్మెంట్ మూడ్ లో ఉన్న ఆడియన్స్ ని తనవైపుకి తిప్పుకోవడం పెద్ద సవాలే. పైగా మునుపటి ఫామ్ లోకి వచ్చి వరసగా సినిమాలు చేయాలంటే ఇది హిట్ కావాల్సిందే. దాని కోసమే ఒంటరి పోరాటం చేస్తున్నారు.
This post was last modified on January 28, 2026 11:22 am
విశాఖపట్నం వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియాకు చిక్కెదురైంది. వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న భారత్కు న్యూజిలాండ్ షాక్…
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇవాళ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక…
తెలంగాణలో మరో కుంభకోణం జరుగుతోందని బీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. దీని…
జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేయడం కలకలం…
సినీ పరిశ్రమను దశాబ్దాల నుంచి పీడిస్తున్న అతి పెద్ద సమస్య.. పైరసీ. గతంలో వీడియో క్యాసెట్లు, సీడీల రూపంలో ఉండే పైరసీ..…
తాను మరో పాదయాత్ర చేయబోతున్నానని ఏపీ మాజీ సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి…