చాలా తక్కువ సమయంలో పెద్ద రేంజికి ఎదిగిన యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ.. ఒక దశ దాటాక ఆ రేంజికి తగ్గ సినిమాలు అందించలేకపోయాడు. ఓ మంచి విజయం కోసం చాలా ఏళ్ల నుంచి అతను ఎదురు చూస్తున్నాడు. గత ఏడాది ‘కింగ్డమ్’తో అతడి ఆశ నెరవేరుతుందనుకున్నారు. కానీ ఆ సినిమా కూడా నిరాశనే మిగిల్చింది.
ఐతే కొత్త ఏడాదిలో ఒకటికి రెండు ప్రామిసింగ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విజయ్. అందులో ఒకటి ‘రౌడీ జనార్దన’. ఆ చిత్రం డిసెంబరులో విడుదల కాబోతోంది. దాని కంటే ముందు అతడి మరో సినిమా ‘రణబాలి’ ప్రేక్షకులను పలకరించబోతోంది.
నిన్ననే ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. సెప్టెంబరు 11నే రిలీజ్ అని కూడా ప్రకటించారు. స్వాతంత్ర్యానికి పూర్వం రాయలసీమ ప్రాంతంలో బ్రిటిష్ వారి మీద వీరోచితంగా పోరాడిన ఒక అన్ సంగ్ హీరో కథ ఇదని తెలుస్తోంది.
నిన్న రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ ఎంతో ఆసక్తికరంగా అనిపించింది. కానీ ఈ గ్లింప్స్‌ను ఏఐ వాడి క్రియేట్ చేశారంటూ ఒక ప్రచారం సోషల్ మీడియాలో నడుస్తోంది. ఈ మధ్య సినిమా గురించి ఒక కబురు తెలిస్తే చాలు.. ఏఐ ద్వారా కథలనే క్రియేట్ చేసేస్తున్నారు నెటిజన్లు.
‘రణబాలి’ గ్లింప్స్‌ను కూడా అలాగే చేశారంటూ దాని మీద సెటైర్లు వేస్తున్నారు కొందరు. దీనిపై దర్శకుడు రాహుల్ సంకృత్యన్ స్పందించాడు. ‘రణబాలి’ వీడియోను ఏఐతో తయారు చేయలేదని రాహుల్ స్పష్టం చేశాడు. ప్రతి ఫ్రేమ్‌ను పాత పద్ధతుల్లోనే ఎంతో కష్టపడి డిజైన్ చేశామని.. ఈ గ్లింప్స్‌ను సిద్ధం చేయడానికి తమ బృందానికి నెలల సమయం పట్టిందని అతను వెల్లడించాడు.
ఈ రోజుల్లో ఏది ఒరిజినలో, ఏది ఏఐనో కనిపెట్టడం కష్టమైపోతున్న నేపథ్యంలో.. ఎంతో కష్టపడి చేసిన పనికి కూడా గుర్తింపు రాని పరిస్థితి తలెత్తుతోంది. రాహుల్ ఎంత కమిట్మెంట్ ఉన్న దర్శకుడో అతను తీసిన ట్యాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ సినిమాలను చూస్తే అర్థమవుతుంది.
కాబట్టి ఎంతో కష్టపడి చేసిన వీడియోను ఏఐ గాటన కట్టి తక్కువ చేయడం కరెక్ట్ కాదు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. రష్మిక మందన్నా కథానాయికగా చేస్తోంది. ఇందులో ‘ది మమ్మీ’ ఫేమ్ ఆర్నాల్డ్ వస్లూ బ్రిటిష్ అధికారిగా విలన్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on January 27, 2026 10:19 pm
పవన్ కళ్యాణ్ వారసుడిగా స్క్రీన్ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్న అకీరానందన్ ఇంకా ఇండస్ట్రీకి రాకముందే హాట్ టాపిక్…
గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పార్టీ కార్యకర్తలు, నాయకుల కోసం శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ…
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ షర్మిల.. రాజ్యసభకు వెళ్తారంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. 2024…
టాలీవుడ్ లోనే కాదు అటు బాలీవుడ్ లోనూ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా తెరకెక్కుతున్న స్పిరిట్ మీద పుకార్ల ప్రహసనం మాములుగా…
సింగరేణి బొగ్గు స్కాం ఆరోపణలు, ఆ నేపథ్యంలో మీడియాలో రకరకాల కథనాలు, కాంగ్రెస్ కీలక నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలపై…
సింగరేణి బొగ్గు స్కామ్ ఆరోపణలు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే నైనీ కోల్ బ్లాక్ కోసం…