టాలీవుడ్ కోరుకున్న శుభారంభం 2026కి దొరికేసింది. సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో నాలుగు పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాక మన శంకరవరప్రసాద్ గారు ఏకంగా రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో బ్లాక్ బస్టర్ కావడం థియేటర్లను కళకళలాడేలా చేస్తోంది.
పండక్కు వచ్చిన అయిదింట్లో రాజా సాబ్ మినహాయించి అన్నీ సేఫ్ అయ్యాయి. అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారి లాభాల్లోకి వెళ్లిపోగా భర్త మహాశయులకు విజ్ఞప్తి అదే దారిలో ఉంది. చాలా గ్యాప్ తర్వాత ఒకే సమయంలో హాళ్లు నిండుగా కనిపించడం కన్నా శుభ పరిణామం మరొకటి లేదని డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు సంతోషంగా ఉన్నారు.
2025 ఆశించిన స్థాయిలో అద్భుతాలు చేయలేదు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తీవ్రంగా నిరాశ పరిస్తే మహేష్ బాబు, అల్లు అర్జున్, చిరంజీవి అసలు దర్శనమే ఇవ్వలేదు. వెంకటేష్, పవన్ కళ్యాణ్ భారీ హిట్లు సాధించగా నాగార్జున కుబేర, కూలిలో సపోర్టింగ్ రోల్స్ చేసి ఫ్యాన్స్ ని అంతగా సంతృప్తి పరచలేకపోయారు.
బాలయ్య అఖండ 2 సైతం నిరాశపరిచింది. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, శంబాలా లాంటి చిన్న చిత్రాలే పెద్ద విజయాలు సాధించాయి. అయితే 2026 ఆశాజనకంగా కనిపిస్తోంది. రాబోయే బ్యాంగర్ ఎవరు ఇస్తారనే దాని మీద మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసారి లిస్టు దానికి తగ్గట్టే చాలా ప్రామిసింగ్ గా కనిపిస్తోంది.
పెద్ది, ఉస్తాద్ భగత్ సింగ్, ది ప్యారడైజ్, ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్, ఫౌజీ, స్వయంభు, విశ్వంభర, డెకాయిట్, గూఢచారి 2 ఇలా చెప్పుకోదగ్గ స్థాయిలో ప్యాన్ ఇండియా సినిమాలు క్యూ కట్టి ఉన్నాయి. వీటికి తోడు టాక్సిక్, దురంధర్ 2 లాంటి డబ్బింగ్ మూవీస్ మీద విపరీతమైన క్రేజ్ నెలకొంది.
ఇవన్నీ ప్రణాళిక ప్రకారం చెప్పిన టైంకి వస్తే వసూళ్ల జాతర మాములుగా ఉండదు. కాకపోతే షూటింగ్స్, పోస్ట్ ప్రొడక్షన్స్ ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగితేనే సాధ్యమవుతుంది. ఒకటి రెండు మిస్సయినా ఈ లైనప్ లో ఎలాంటి మార్పు ఉండదు. ఫిబ్రవరిలో కొంచెం గ్యాప్ వచ్చినా మార్చి నుంచి పెద్ద సినిమాల హడావిడి ఓ రేంజ్ లో ఉండబోతోంది.
This post was last modified on January 20, 2026 1:18 pm
ఏపీ లిక్కర్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కోనున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తన ట్వీట్లతో రాజకీయ వర్గాల్లో…
కేరళ రాష్ట్రంలో ఇప్పుడొక వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీపక్ అనే 42 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం…
టాలీవుడ్ లో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుల కొరత తీవ్రంగా ఉంది. అందులోనూ తమ భుజాల మీద సినిమాను మోసి నిలబెట్టే…
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన…
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడులో గవర్నర్ వర్సెస్ డీఎంకే ప్రభుత్వం పోరు మరోసారి బహిరంగంగా బయటపడింది. మంగళవారం ఉదయం…
గత కొన్ని నెలలుగా మూవీ లవర్స్ మధ్య విపరీతంగా చర్చకు వచ్చిన టాపిక్ పెద్ది - ప్యారడైజ్ బాక్సాఫీస్ క్లాష్.…