Movie News

వచ్చే సంక్రాంతికి శర్వాతో వచ్చేది…

ఒకప్పుడు వైభవం చూసిన స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల.. గత కొన్నేళ్లుగా హీరోలు, నిర్మాతలు దొరక్క ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. మంచు విష్ణుతో సినిమా చేద్దామన్నా కూడా అది సెట్ కాలేదు. చివరికి గోపీచంద్‌తో కష్టపడి ‘విశ్వం’ సినిమా సెట్ చేసుకున్నాడు. దానికీ ఇబ్బందులు తప్పలేదు. మధ్యలో చేతులు మారి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సౌజన్యంతో పూర్తయిన ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.

దీంతో మళ్లీ వైట్ల కెరీర్‌లో గ్యాప్ తప్పలేదు. కొన్ని ప్రయత్నాలు చేసి ఫెయిలైన వైట్ల.. ఎట్టకేలకు తన కొత్త చిత్రాన్ని ఖాయం చేసుకున్నాడు. సంక్రాంతికి రిలీజైన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో సక్సెస్ అందుకున్న శర్వానంద్.. వైట్ల కొత్త చిత్రంలో హీరోగా నటించబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా శర్వానే వెల్లడించాడు.

‘నారీ నారీ నడుమ మురారి’ సక్సెస్ మీట్లో తన కొత్త చిత్రం వైట్లతో ఉంటుందని శర్వా అనౌన్స్ చేశాడు. సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండని వైట్ల.. ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా చూసి శర్వా అండ్ టీంను కొనియాడుతూ పోస్టు పెట్టినపుడే.. వీళ్లిద్దరి కలయికలో సినిమా రాబోతోందా అన్న సందేహాలు కలిగాయి. ఇప్పుడు శర్వా ఆ విషయాన్ని ధ్రువీకరించాడు.

ఇంతకుముందు వైట్లతో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు రవిశంకర్, నవీన్ యెర్నేని ఈ చిత్రాన్ని నిర్మించనుండడం విశేషం. వచ్చే సంక్రాంతికే ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు కూడా శర్వా వెల్లడించాడు. ఎక్స్‌ప్రెస్ రాజా, శతమానం భవతి, నారీ నారీ నడుమ మురారి చిత్రాలతో సంక్రాంతి హ్యాట్రిక్ హీరోగా నిలిచిన శర్వా.. తనకు బాగా కలిసొచ్చిన అదే సీజన్లో తర్వాతి సినిమాను తీసుకురాబోతున్నాడు. ఒకప్పుడు కామెడీ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన వైట్ల.. శర్వాతో తన మార్కు సినిమా తీసి మళ్లీ ప్రేక్షకుల మెప్పు పొందుతాడేమో చూడాలి మరి.

This post was last modified on January 17, 2026 7:45 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఒక పెళ్ళి ఖర్చుతో ఆరు పెళ్ళిళ్ళు

వారిది స్థితిమంతమైన కుటుంబం.. ఆ కుటుంబంలో పెళ్లంటే మాటలా...? విందులు, వినోదాలు, ఖర్చుకు కొదవేముంది.. అయితే ఇవన్నీ కాదనుకుని అదే…

19 minutes ago

విజయ్ సేతుపతి… ఓ పుష్పక విమానం

గత రెండు దశాబ్దాల్లో దక్షిణాదిన ఉత్తమ నటుల్లో ఒకడిగా ఎదిగిన నటుడు విజయ్ సేతుపతి.. బహు భాషా నటుడిగా ఎదిగిన…

7 hours ago

మహేష్ కొత్త మల్టీప్లెక్స్… ఎంత పెద్ద సీటింగో

సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఏషియన్ మూవీస్ వాళ్లతో కలిసి హైదరాబాద్‌లో నిర్మించిన ‘ఏఎంబీ సినిమాస్’ మల్టీప్లెక్స్ ఎంత పెద్ద…

7 hours ago

బైకర్ కోసం తలుపులు తెరుచుకున్నాయి

మనమే తర్వాత గ్యాప్ తీసుకున్న శర్వానంద్ కు నారి నారి నడుమ మురారి రూపంలో పెద్ద రిలీఫ్ దొరికింది. ఇంత…

9 hours ago

తిరుప‌తి త‌ల‌రాత మార్చేలా… ‘ఏపీ-ఫ‌స్ట్‌’

తిరుప‌తి జిల్లాకు సీఎం చంద్ర‌బాబు భారీ ప్రాజెక్టు ప్ర‌క‌టించారు. తిరుప‌తి త‌ల‌రాత మార్చేలా.. ఏపీ-ఫ‌స్ట్ ప‌థ‌కాన్ని ఆయ‌న ఎనౌన్స్ చేశారు.…

11 hours ago

కాకినాడ‌కు భారీ ప్రాజెక్టు.. ఎన్ని వేల కోట్లో….

ఏపీ మంత్రి నారా లోకేష్‌.. శుక్ర‌వారం ఉద‌యం ఒక ట్వీట్ చేశారు. ``ఈ రోజు సాయంత్రం అదిరిపోయే క‌బురు చెబుతాను…

11 hours ago