ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర కథానాయకులతో సినిమాలు చేస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ ఆకట్టుకుంది. అనుష్క, నయనతారల తర్వాత తనకంటూ ఒక ఇమేజ్, మార్కెట్ సంపాదించుకున్న అరుదైన కథానాయికల్లో ఆమె ఒకరు. ఐతే కథానాయికలు మరీ ఎక్కువ కాలం టాప్‌లో కొనసాగడం కష్టం. వయసు పెరిగి, గ్లామర్ తగ్గాక కెరీర్ డౌన్ అవుతుంది.
పైగా సమంత పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో సెటిల్ కావడం.. తర్వాత విడాకులు తీసుకోవడం.. అనారోగ్యం పాలవడంతో కెరీర్‌కు అనుకున్నట్లుగా ముందుకు సాగలేదు. ముఖ్యంగా విడాకులు, అనారోగ్యం వల్ల సమంత తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కోవడంతో ఒక దశలో సమంత లుక్స్ కూడా దెబ్బ తిన్న మాట వాస్తవం. ఆమె ఒక రకమైన వేదనలో కనిపించడం అభిమానులను ఎంతో బాధించింది.
ఐతే అనారోగ్యం నుంచి కోలుకోవడంతో పాటు మళ్లీ కొత్త తోడును వెతుక్కోవడం.. ఇటీవలే రాజ్ నిడిమోరును పెళ్లి కూడా చేసుకోవడంతో సమంతలో మళ్లీ జోష్ వచ్చింది. పెళ్లి తర్వాత సామ్ తొలిసారిగా రాజ్‌తో కలిసి తాజాగా పబ్లిక్ అప్పియరెన్స్ ఇచ్చింది. ఈ సందర్భంగా సమంతను చూసి అభిమానులు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. సమంత ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్న సంగతి స్పష్టంగా కనిపించింది. తన ముఖంలో మునుపటి గ్లో వచ్చింది.
వ్యక్తిగత జీవితంలో జరిగే పరిణామాలు మనిషి మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో చెప్పడానికి సమంతనే ఉదాహరణ. ఇప్పుడు ఆమె చాలా సంతోషంగా ఉన్న విషయం ముఖంలో ప్రతిబింబిస్తోంది. సామ్ మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అవుతుండడం కూడా అభిమానులకు ఆనందాన్నిస్తోంది.
ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘మా ఇంటి బంగారం’ టీజర్ ఇటీవలే రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా సక్సెస్ అయి సమంతలో మరింత ఆనందాన్ని నింపాలని అభిమానులు కోరుకుంటున్నారు.
This post was last modified on January 11, 2026 6:10 pm
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…