ప్రభాస్ హీరోగా మారుతి రూపొందించిన రాజాసాబ్ డిసెంబరు 5నే రిలీజ్ కావాల్సింది. కానీ సంక్రాంతి సీజన్ అయితే బాగుంటుందని ఈ నెల 9కి సినిమాను వాయిదా వేశారు. కానీ పండక్కి తెలుగు నుంచి మరో నాలుగు సినిమాలు బరిలో ఉండడం.. తమిళం నుంచి జననాయకుడు సినిమా వస్తుండడంతో ఈ చిత్రానికి థియేటర్ల సమస్య తప్పలేదు.
జననాయకుడు సినిమాకు తెలుగులో కూడా భారీగా స్క్రీన్లు ఇచ్చారు. మరోవైపు తమిళనాడు సహా దక్షిణాదిన మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ జననాయగన్ భారీగా రిలీజవడంతో ప్రభాస్ సినిమాకు కొంతమేరకు ఇబ్బందిగా మారింది. ఓవర్సీస్‌లో కూడా ఇదే పరిస్థితి. ఐతే ఇప్పుడు విజయ్ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి అనుకోని అడ్డంకులు ఎదురయ్యాయి. వ్యవహారం కోర్టుకు చేరింది. అక్కడా సత్వర ఉపశమనం దక్కట్లేదు.
ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తుంటే జనవరి 9న జననాయగన్ రిలీజవడం కష్టంగానే ఉంది. కోర్టు తీర్పును బట్టి కొత్త డేట్ ఖరారవుతుంది.
ఈ వీకెండ్లో జననాయగన్ రిలీజ్ కాకపోతే రాజాసాబ్ జాక్ పాట్ కొట్టినట్లే. వరల్డ్ వైడ్ సోలోగా సినిమా రిలీజవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో జననాయగన్ కోసం అట్టిపెట్టిన స్క్రీన్లు కూడా ప్రభాస్ సినిమాకే దక్కుతాయి. దీని కంటే సంతోషించాల్సిన విషయం ఏంటంటే.. తమిళనాడు, కర్ణాటక, కేరళలో రాజాసాబ్‌కు పోటీనే ఉండదు. కావాల్సినన్ని స్క్రీన్లు ఇస్తారు.
ఉత్తరాదిన కూడా వసూళ్ల పంట పండించుకోవడానికి అవకాశముంటుంది. ఓవర్సీస్‌లోనూ రాజాసాబ్‌కు ఎదురే ఉండదు. ముందు అనుకున్న దాని కంటే ఓపెనింగ్స్ భారీగా ఉండడం ఖాయం. సినిమాకు పాజిటివ్ టాక్ రావాలే కానీ.. తొలి వీకెండ్లోనే బయ్యర్లు పెట్టుబడిలో చాలా వరకు వెనక్కి రాబట్టుకోవడానికి అవకాశముంటుంది.
డిసెంబరులో రాజాసాబ్ రిలీజై ఉంటే.. దురంధర్ దెబ్బ దానిపై గట్టిగానే పడేది. ఇప్పుడు సంక్రాంతి పండక్కి తోడు.. పోటీలేని బాక్సాఫీస్ ఆ సినిమాకు బాగా కలిసొచ్చేదే. మరి ఈ అడ్వాంటేజీని ప్రభాస్-మారుతి ఏమేర సద్వినియోగం చేసుకుంటారో చూడాలి.
This post was last modified on January 7, 2026 9:55 pm
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…