తెలుగులో ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోకుండా.. ఎలాంటి పాత్ర అయినా చేయడానికి ముందుండే హీరో విక్టరీ వెంకటేష్. ప్రతి సినిమాలో హీరోయిజమే ఉండాలని.. తానే హైలైట్ కావాలని ఆయన ఆలోచించరు. అతి సామాన్యమైన పాత్రలు కూడా చేస్తుంటారు. తన సినిమాల్లో పాత్రకు ఎలివేషన్ తగ్గినా.. పంచులు పడినా ఓకే అంటారు. స్వయంగా తన మీద తానే పంచులు కూడా వేసుకుంటారు.
ఇలాంటి భేషజం లేని స్టార్లు అరుదుగా ఉంటారు. వెంకీ వేరే సినిమాల్లో ప్రత్యేక పాత్రలు, క్యామియోలు చేయడానికి కూడా వెనుకాడడు. మల్టీస్టారర్లకూ రెడీగా ఉంటాడు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా చేయడమే కాక.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘గోపాల గోపాల’లో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు వెంకీ. ఆ తర్వాత మరో పవన్ సినిమా ‘అజ్ఞాతవాసి’లో వెంకీ క్యామియో రోల్ చేశాడు.
పవన్‌తో వెంకీ కలిసి నటించిన రెండు సినిమాలూ సంక్రాంతికే రిలీజయ్యాయి. అందులో ‘గోపాల గోపాల’ యావరేజ్‌గా ఆడింది. ‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్ అయింది. ఇప్పుడు మరో మెగా హీరో, పవన్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవితో వెంకీ జట్టు కట్టాడు. ఆ చిత్రమే.. మన శంకర వరప్రసాద్. ఈ చిత్రం కూడా సంక్రాంతికే రిలీజవుతోంది. పవన్‌తో సంక్రాంతికి ఆశించిన ఫలితాలు అందించలేకపోయిన వెంకీ.. ఇప్పుడు అదే పండక్కి చిరు సినిమాలో ప్రత్యేక పాత్రతో ఎలాంటి రిజల్ట్ రాబడతాడా అన్న ఆసక్తి వ్యక్తమవుతోంది.
అనిల్ రావిపూడి సినిమా అంటే మినిమం ఉంటుంది కాబట్టి ‘అజ్ఞాతవాసి’ లాంటి ఫలితం వచ్చే అవకాశం ఎంతమాత్రం లేదు. కానీ ‘గోపాల గోపాల’లా యావరేజ్ రిజల్ట్‌తో కూడా మెగా ఫ్యాన్స్ సంతృప్తి చెందరు. చిరుకు ఒక పెద్ద బ్లాక్ బస్టర్ పడాలని కోరుకుంటున్నారు. ఈ చిత్రంలో వెంకీ పాత్ర హైలైట్‌గా ఉంటుందని టీం బలంగా చెబుతోంది. చిరుతో కలిసి ఆయన పండించే వినోదం థియేటర్లను హోరెత్తిస్తుందని అంటున్నారు. మరి వెంకీ ఈ సంక్రాంతికి ‘మెగా’ లెక్కలు మారుస్తాడేమో చూడాలి.
This post was last modified on January 7, 2026 3:44 pm
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…
భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…
యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…