స‌స్పెన్సులో పెట్టేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

చాలా త‌క్కువ స‌మ‌యంలో పెద్ద స్టార్‌గా ఎదిగిన న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అత‌డితో సినిమా చేయాల‌నే ఆశ‌తో ఉన్న ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల జాబితా పెద్ద‌దే. ఐతే అత‌డికి ఈ మ‌ధ్య కొంచెం క్రేజ్ త‌గ్గింది. డియ‌ర్ కామ్రేడ్‌, వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ సినిమాలు దెబ్బ తిన‌డంతో జోరు త‌గ్గించాడు. ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఫైట‌ర్ సినిమా చేస్తున్న అత‌ను.. త‌ర్వాతి సినిమాను ఇప్ప‌టిదాకా అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు.

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో త‌న ఫ్యూచ‌ర్ ప్రాజెక్టుల లైన‌ప్ చెప్పేశాడు విజ‌య్. ఇంత‌కుముందు ప్ర‌చారం జ‌రిగిన‌ట్లే శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తాను న‌టిస్తున్న‌ట్లు అత‌ను ఖ‌రారు చేశాడు. ఐతే అంద‌రూ అనుకుంటున్న‌ట్లు విజ‌య్ ఆ సినిమాను దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్లో చేయ‌ట్లేదు. శివ సినిమాకు నిర్మాత వేర‌ని అత‌ను చెప్ప‌క‌నే చెప్పాడు.

త‌న త‌ర్వాతి సినిమా శివతో ఉంటుంద‌ని మాత్రమే చెప్పిన విజ‌య్.. ఆ త‌ర్వాత దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్లో సినిమా చేస్తాన‌న్నాడు. ఆ సినిమాకు ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌నే విష‌యంలో విజ‌య్ స‌స్పెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. రాజు నిర్మాణంలో న‌టించ‌డానికి చాలా కాలంగా ఎదురు చూస్తున్నాన‌ని.. ఇప్ప‌టికే క‌థ‌, ద‌ర్శ‌కుడు ఖ‌రార‌య్యార‌ని చెప్పాడు. ఇప్పుడే ఆ వివ‌రాలు వెల్ల‌డిస్తే మ‌జా ఉండ‌ద‌న్న విజ‌య్.. త్వ‌ర‌లో వాటి వివ‌రాలు వెల్ల‌డిస్తాన‌న్నాడు.

ఇక ఫైట‌ర్ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేయ‌డం గురించి అడిగితే.. తాను ఏదో ట్రై చేస్తున్నాన‌ని.. ఐతే సిక్స ప్యాక్ వ‌స్తుందో లేదో మాత్రం చెప్ప‌లేన‌ని అన్నాడు. ఇది బాక్సింగ్ సినిమా కాద‌ని.. మార్ష‌ల్ ఆర్ట్స్ మిక్స్‌తో న‌డుస్తుంద‌ని చెప్పాడు. పూరితో సినిమా చాలా క్రేజీగా ఉంటుంద‌ని.. అది ఒక పండ‌గ లాంటి సినిమా అని.. ప్రేక్ష‌కులు బాగా ఎంజాయ్ చేస్తార‌ని విజ‌య్ అన్నాడు