Movie News

సల్మాన్ చేస్తున్నది మనోడి పాత్రేనా?

చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. ప్రస్తుతం తన ఆశలన్నీ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ మీదే ఉన్నాయి. భారత్, చైనా సరిహద్దుల్లో ఉన్న గాల్వాన్ లోయలో.. ఐదేళ్ల కిందట ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ముందుగా భారత సైన్యాన్ని కవ్విస్తూ చైనా ఆర్మీ దాడి చేస్తే.. తక్కువమందే ఉన్నప్పటికీ ఇండియన్ సోల్జర్స్ వీరోచితంగా పోరాడారు. 

ఇందులో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబుతో పాటు 20 మంది దాకా భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నేపథ్యంలోనే సల్మాన్ హీరోగా అపూర్వ లఖియా ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ను రూపొందించాడు. ఇటీవలే దీని టీజర్ లాంచ్ అయింది. ఐతే దీనికి మిశ్రమ స్పందన లభించింది. టీజర్ చూశాక ఇంతకీ సల్మాన్ ఏ పాత్ర చేస్తున్నాడు అనే చర్చ మొదలైంది. దీనికి సమాధానం.. సంతోష్ బాబు అని తెలుస్తోంది. కొన్ని నెలల ముందే ఈ వార్తలు చక్కర్లు కొట్టాయి కానీ టీజర్ చూసాక స్పష్టం అవుతుంది.

గాల్వాన్ లోయలో చైనా దాడి చేసినపుడు భారత సైనికులు చాలా తక్కువమందే ఉన్నారు. కాసేపటికే కల్నల్ సంతోష్ బాబు నేతృత్వంలోని మరో దళం అక్కడికి చేరుకుని చైనా సైన్యంతో వీరోచితంగా పోరాడింది. ఈ ఎటాక్‌లో ప్రాణాలు కోల్పోయిన సంతోష్ బాబును భారత ప్రభుత్వం మహావీర చక్ర పురస్కారంతో గౌరవించింది. సల్మాన్ ఈ పాత్రనే ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’లో పోషిస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్‌తో ‘జంజీర్’ లాంటి డిజాస్టర్ తీసిన అపూర్వ లఖియా ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ను రూపొందిస్తున్నాడు. దీని టీజర్ అయితే ఏమంత ఎగ్జైటింగ్‌గా అనిపించలేదు. 

ఈ సినిమా విషయమై చైనా ఆర్మీ స్పందించడం గమనార్హం. గాల్వాన్ ఎటాక్ సమయంలో తాము భారత భూభాగంలోకి వెళ్లలేదని.. ఇండియన్ ఆర్మీనే తమ ప్రాంతంలోకి వచ్చిందని.. తమ దేశానికి చెడ్డ పేరు తెచ్చేలా అవాస్తవాలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారని.. ఈ సినిమా తమ సైన్యం దృఢ సంకల్పాన్ని సడలించలేదని చైనా సైన్యాధికారి ఒకరు పేర్కొన్నారు. ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ రంజాన్ కానుకగా వచ్చే ఏడాది మార్చిలో విడుదలయ్యే అవకాశాలున్నాయి.

This post was last modified on December 30, 2025 9:45 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అన్నగారంటే ఇంత నిర్లక్ష్యమా?

థియేటర్లలో విడుదలైన పధ్నాలుగు రోజులకే కార్తీ కొత్త సినిమా వా వతియార్ ఓటిటిలో వచ్చేయడం అభిమానులకు షాక్ కలిగించింది. తెలుగు…

38 minutes ago

మారుతికి కొత్త‌ర‌కం టార్చ‌ర్

రాజాసాబ్ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతూ సినిమా మామూలుగా ఉండ‌ద‌ని చెబుతూ, ప్ర‌భాస్ అభిమానుల‌కు భ‌రోసానిస్తూ, తేడా…

3 hours ago

సంచలన బిల్లు: అసెంబ్లీకి రాకపోతే జీతం కట్

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. తాజాగా బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు బడ్జెట్…

3 hours ago

శంక‌ర్‌కు బ‌డా నిర్మాత కండిష‌న్‌

రాజ‌మౌళి కంటే ముందు సౌత్ ఇండియ‌న్ సినిమా స్థాయిని పెంచి.. అద్భుత‌మైన క‌థ‌లు, క‌ళ్లు చెదిరే విజువ‌ల్ ఎఫెక్ట్స్, సాంకేతిక…

3 hours ago

హిర‌ణ్య క‌శ్య‌ప‌ను వ‌ద‌ల‌ని గుణ‌శేఖర్

హిర‌ణ్య‌క‌శ్య‌ప‌.. టాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు చ‌ర్చ‌ల్లో ఉన్న చిత్రం. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్.. రుద్ర‌మ‌దేవి త‌ర్వాత తీయాల‌నుకున్న సినిమా…

4 hours ago

పిఠాపురం కోసం ఢిల్లీ వరకు.. కేంద్ర మంత్రులకు పవన్ విజ్ఞాపన

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర…

4 hours ago