అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘భాగమతి’ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే అందుకుంది. అరుంధతి మాదిరిగా ఘన విజయం సాధించకపోయినా కానీ అనుష్క పాపులారిటీ, నటన ఆ చిత్రాన్ని విజయపథంలో నిలబెట్టాయి. ఆ చిత్రంలో పలు లోపాలున్నా కానీ అనుష్క ఫ్యాక్టర్ దానికి కొమ్ము కాచింది. ఆ చిత్ర దర్శకుడు అశోక్ హిందీలోను తానే రీమేక్ చేసాడు. భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘దుర్గమతి’ అమెజాన్ ప్రైమ్‍లో రిలీజ్ అయింది.
ఈ చిత్రానికి అందరి నుంచి చాలా డిజప్పాయింటింగ్ రిపోర్ట్ వస్తోంది. ముఖ్యంగా భాగమతి చూసిన వాళ్లయితే అనుష్క లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని చెబుతున్నారు. హిందీ రీమేక్‍లో నటించిన నటీనటులు అందరూ కూడా ఎలాంటి ఆసక్తి లేకుండా మరబొమ్మల్లా నటించేసారు. దీంతో దర్శకుడు అశోక్ కూడా ఏమీ చేయలేకపోయాడు. తెలుగు దర్శకులు హిందీలో రీమేక్ చేసే అవకాశం వచ్చినపుడు సద్వినియోగం చేసుకున్నారు. ఠాగూర్ రీమేక్ చేసిన క్రిష్, అర్జున్ రెడ్డి రీమేక్ చేసిన సందీప్ వంగా బాలీవుడ్‍లో గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ‘పిల్ల జమీందార్’ దర్శకుడు అశోక్ మాత్రం హిందీలో హిట్టు కొట్టే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు.
This post was last modified on December 12, 2020 12:53 am
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…