బాహుబలితో అంతర్జాతీయ స్థాయిలో తిరుగులేని గుర్తింపు సంపాదించాడు ప్రభాస్. అతడికి సంబంధించిన ప్రతి వార్తా ఇప్పుడు అమితాసక్తిని రేకెత్తించేదే. తన ఇల్లు, తన కారు, తన ఫామ్ హౌస్.. ఇలా ప్రభాస్‌కు సంబంధించిన ప్రతి అంశం మీదా జనాలకు ప్రత్యేక దృష్టి ఉంటుంది. మీడియా కూడా ఈ వివరాలు రాబట్టడానికి ప్రయత్నిస్తుంటుంది.
తాజాగా ప్రభాస్ ఫామ్ హౌస్ ముచ్చట్ల గురించి బాలీవుడ్ మీడియాలోనూ వార్తలొస్తుండటం విశేషం. దాని విలువ ఏకంగా రూ.60 కోట్లని అంటున్నారు. హైదరాబాద్ శివార్లలో చాలామంది సెలబ్రెటీల్లాగే ప్రభాస్ సైతం పెద్ద ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ పంటలు పండించడంతో పాటు వివిధ రకాల చెట్లూ పెంచుతున్నారు.
ప్రభాస్ ఎప్పుడైనా అక్కడికి వెళ్లి ఆహ్లాదంగా గడపడానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేశారట. సౌకర్యాలకు ఏ లోటూ లేని ఆ ఫామ్ హౌస్ విలువ రూ.60 కోట్లంటూ ఓ ప్రముఖ బాలీవుడ్ మీడియా సంస్థ కథనం ప్రచురించింది. తెలంగాణ అధికార పార్టీ ఎంపీ సంతోష్‌తో కలిసి ప్రభాస్ మొక్కలు నాటింది ఈ ఫామ్ హౌస్‌లోనే.
ప్రకృతి ప్రేమికుడైన ప్రభాస్.. హైదరాబాద్ శివార్లలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుని దాన్ని మెయింటైనెన్స్ బాధ్యత తీసుకున్న సంగతి కూడా తెలిసిందే. ఇందుకోసం కోసం అతను కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. చేయబోతున్నాడు. కొన్నేళ్ల పాటు దాని నిర్వహణ అంతా ప్రభాస్ టీమే చూసుకోనుంది.
This post was last modified on December 11, 2020 8:35 am
భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…