అవ‌తార్ దెబ్బ‌ను అఖండ త‌ట్టుకోగ‌ల‌డా?

అఖండ‌-2 సినిమా మీద ఆ చిత్ర బృంద‌మే కాదు.. టాలీవుడ్ ఇండ‌స్ట్రీనే ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది. కానీ ఈ చిత్రం అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. ఒక వారం ఆల‌స్యంగా రిలీజైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ రాగా.. తొలి వీకెండ్ వ‌ర‌కు వ‌సూళ్లు ఓకే అనిపించాయి. కానీ వీకెండ్ త‌ర్వాత సినిమా నిల‌బ‌డ‌లేకపోయింది. వీక్ డేస్ రాగానే వ‌సూళ్లు ఒక్క‌సారిగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. వీకెండ్ త‌ర్వాత డ్రాప్ స‌హ‌జ‌మే కానీ.. ఈ సినిమాకు మ‌రీ ఎక్కువ డ్రాప్ క‌నిపించింది.

వారం వాయిదా త‌ర్వాత అఖండ‌-2 రేట్ల‌ను త‌గ్గించినా స‌రే.. బ‌య్య‌ర్లు సేఫ్ జోన్లోకి రాని ప‌రిస్థితి. నైజాం వ‌ర‌కు ప‌ర్వాలేదు కానీ.. మిగ‌తా ఏరియాల్లో సినిమా బ్రేక్ ఈవెన్‌కు చాలా దూరంలో ఉంది. ఐతే అఖండ‌-2కు కాస్త సానుకూలంగా క‌నిపిస్తున్న విష‌యం.. ఈ వారం తెలుగు నుంచి క్రేజీ సినిమాలేవీ రిలీజ్ కావ‌ట్లేదు. ఉన్న‌వాటిలో గుర్రం పాపిరెడ్డి కాస్త నోట‌బుల్ మూవీ. కానీ అది అఖండ‌-2 మీద ప్ర‌భావం చూపేది కాదు.

కానీ అవ‌తార్-3 రూపంలో బాల‌య్య సినిమాకు అడ్డంకి ఉంది. అవ‌తార్ ఫ్రాంఛైజీలో గ‌త రెండు చిత్రాల‌తో పోలిస్తే దీనికి బ‌జ్ త‌క్కువే కానీ.. అలా అని కొట్టి పారేసే ప‌రిస్థితి లేదు. ఈ వారానికి ఇదే తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ లీడ‌ర్ అన‌డంలో సందేహం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ ఒక మోస్త‌రుగా జ‌రిగాయి. వీకెండ్లో ఈ సినిమాను జ‌నం బాగానే చూస్తార‌నే అంచ‌నాలున్నాయి. ఐతే రేప్పొద్దున ఈ సినిమాకు ఎలాంటి టాక్ వ‌స్తుంద‌న్న‌ది చూడాలి.

టాక్ సూప‌ర్ అని వస్తే వీకెండ్లో ఆ సినిమా వ‌సూళ్ల మోత మోగించ‌డం.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పూర్తిగా లీడ్ తీసుకోవ‌డం ఖాయం. రెండో వీకెండ్ నుంచి చెప్పుకోద‌గ్గ షేర్ వ‌స్తుంద‌ని.. న‌ష్టాల భారాన్నిత‌గ్గించుకుందామ‌ని అఖండ‌-2 బ‌య్య‌ర్లు చూస్తున్నారు. ఇప్ప‌టికీ రెండు రాష్ట్రాల్లో ఆ చిత్రానికి ఎక్కువ‌గానే స్క్రీన్లు, షోలు కొన‌సాగుతున్నాయి. మ‌రి అవ‌తార్-3 పోటీని త‌ట్టుకుని ఆ సినిమా రెండో వీకెండ్లో ఏమేర షేర్ రాబ‌డుతుందో చూడాలి. టీం అయితే ఇప్ప‌టికీ ప్ర‌మోష‌న్లు కొన‌సాగిస్తోంది. బాల‌య్య‌, బోయ‌పాటి కాశీకి చేరుకుని అక్క‌డ ప్రెస్ మీట్ పెట్టే ప్ర‌య‌త్నంలో ఉన్నారు.