ఆదిత్య ధర్.. ఇప్పుడు బాలీవుడ్లోనే కాక, దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీల్లోనూ చర్చనీయాంశం అవుతున్న పేరిది. బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్లలో ఒకటిగా నిలిచేలా కనిపిస్తున్న ‘దురంధర్’ సినిమాకు దర్శకుడే కాదు, నిర్మాత కూడా ఇతనే. దర్శకుడిగా రెండో సినిమానే అయినా.. ఫిలిం మేకింగ్‌లో తన నైపుణ్యానికి అందరూ ఫిదా అయిపోతున్నారు. ఇంత త్వరగా నిర్మాత అవతారం ఎత్తి భారీ బడ్జెట్లో సినిమా తీయడం, ఎంతో కాన్ఫిడెంట్‌గా ఒకేసారి రెండు భాగాలనూ పూర్తి చేసి ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసి అద్భుత ఫలితాన్ని రాబట్టడంతో అతడి పేరు మార్మోగుతోంది.
తన గురించి తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఇంతకీ తన నేపథ్యమేంటి? దర్శక నిర్మాతగా ఈ స్థాయి అందుకోవడానికి ముందు తన ప్రయాణం ఎలా సాగింది? తెలుసుకుందాం పదండి.
ఆదిత్య ధర్ దిల్లీకి చెందిన కశ్మీరీ పండిట్ల కుటుంబంలో పుట్టాడు. అతడికి సినీ రంగంలో గాడ్ ఫాదర్స్ ఎవ్వరూ లేరు. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ముందుగా అతను లిరిసిస్ట్‌గా పని చేశాడు. ‘కాబూల్ ఎక్స్‌ప్రెస్’ సహా కొన్ని చిత్రాలకు పాటలు రాశాడు. తర్వాత డైలాగ్స్, స్క్రీన్ ప్లే రైటింగ్‌లోకి అడుగు పెట్టాడు. ఆక్రోశ్, తేజ్ లాంటి చిత్రాలకు రచనా విభాగంలో పని చేశాడు.
పదేళ్ల పాటు అతను స్ట్రగులయ్యాడు. బిజీ రైటర్ కాలేకపోయాడు. పెద్దగా డబ్బులు సంపాదించలేదు. మధ్యలో దర్శకుడిగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. చివరికి ‘రాత్ బాకీ’ అనే సినిమా ఓకే అయింది. కానీ అది కొన్ని కారణాలతో ముందుకు సాగలేదు. అందుకు యూరీ ఎటాక్స్ కూడా ఒక కారణం. ఆదిత్య కొన్ని ముఖ్య పాత్రల కోసం పాకిస్తాన్ నటులను తీసుకోగా వారిపై నిషేధం పడింది.
తన సినిమా ఆగిపోవడానికి ఒక కారణం అయిన యురి ఎటాక్స్ మీదే తర్వాత కథ రాశాడు ఆదిత్య. ‘యురి: ది సర్జికల్ స్ట్రైక్’ పేరుతో సినిమా తీశాడు. అది ఎవ్వరూ ఊహించనంత బ్లాక్ బస్టర్ అయింది. రూ.30 కోట్ల బడ్జెట్లో సినిమా తీస్తే.. రూ.350 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. ఆ సినిమాలో కథానాయికగా నటించిన యామి గౌతమ్‌నే తర్వాత అతను పెళ్లి చేసుకున్నాడు. ‘యురి’ అంత పెద్ద హిట్టయినప్పటికీ.. తన నుంచి మరో సినిమా రావడానికి చాలా టైం పట్టింది.
మధ్యలో ‘ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ అనే సినిమా మీద కొన్నేళ్లు పని చేశాడు. బడ్జెట్ సమస్యల వల్ల అది ముందుకు కదల్లేదు. ఆపై స్వీయ నిర్మాణంలో ‘దురంధర్’ మొదలుపెట్టాడు. అనేక కష్టాలకు ఓర్చి సినిమాను పూర్తి చేశాడు. బడ్జెట్ సమస్యలు తలెత్తితే జియో స్టూడియోస్ అతడికి అండగా నిలిచింది. ఎన్నో అనుమానాల మధ్య ఈ సినిమా రిలీజైంది. ఎవ్వరూ ఊహించని స్థాయిలో బ్లాక్‌బస్టర్ అయి ఆదిత్య పేరు మార్మోగేలా చేస్తోంది.
This post was last modified on December 15, 2025 3:20 pm
హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…
మెస్సీ ఇండియాకు రావడమే ఒక పండగలా ఉంటే, ముంబైలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్…
దురంధర్ అంచనాలకు మించి దూసుకుపోతున్న మాట నిజమే. అఖండ 2 వచ్చాక స్లో అవుతుందనుకుంటే రివర్స్ లో నిన్న వీకెండ్…
డిజిటల్ అరెస్ట్ పేరిట జరుగుతున్న సైబర్ మోసాలు సామాన్యులకే కాదు, ప్రముఖులకూ పెద్ద ముప్పుగా మారాయి. ప్రభుత్వం ఎంత అవగాహన…
ఓటిటిలో డైరెక్ట్ గా రిలీజైనా కలర్ ఫోటోకు మంచి స్పందన వచ్చిన సంగతి ప్రేక్షకులకు గుర్తే. కొత్త ప్రేమకథ కాకపోయినా…
అఖండ సినిమా ఓటీటీలో రిలీజైనపుడు హిందీ ప్రేక్షకులు సైతం విరగబడి చూశారు. డివైన్ ఎలిమెంట్స్‌తో తీసిన సినిమాలకు కొన్నేళ్ల నుంచి…