‘అఖండ 2.. తాండవం’ బాక్సాఫీస్ దగ్గర తాండవం ఆడుతూ దూసుకెళ్తోంది. సినిమాకు మిక్స్డ్ రివ్యూలు, టాక్ వచ్చినప్పటికీ.. తొలి రోజు ఓపెనింగ్స్‌పై ఆ ప్రభావం ఏమీ కనిపించలేదు. మేకర్స్ ప్రకటించిన ప్రకారం తొలి రోజు ఈ చిత్రం రూ.60 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఒరిజినల్ ఫిగర్స్ అంత ఉండకపోవచ్చు కానీ.. బాలయ్య కెరీర్లో ఇది హైయెస్ట్ డే-1 గ్రాసర్ అనడంలో సందేహం లేదు. వీకెండ్ వరకు సినిమా నిలకడగానే వసూళ్లు సాధించేలా కనిపిస్తోంది.
ఈ సినిమాలో కొందరికి కొన్ని సీన్లు నచ్చాయి. కొందరికి నచ్చలేదు. కానీ అందరూ ఏకగ్రీవంగా పాజిటివ్‌గా స్పందించిన ఎపిసోడ్ ఒకటి ఉంది. అదే.. అఖండ తల్లి చనిపోతే తన బదులు స్వయంగా శివుడే వచ్చి అంత్యక్రియలు నిర్వహించే సీన్. సినిమాలో ఇది సర్ప్రైజ్ సీన్ అని చెప్పొచ్చు. ఆ సన్నివేశం అందరినీ కదిలిస్తుంది. ఆ సీన్లో శివుడి పాత్రలో నటించిన ఆర్టిస్టు కూడా బాగా చేశాడు. శివుడి పాత్రకు అతను బాగా సెట్టయ్యాడు. క్లైమాక్స్‌లోనూ మరోసారి శివుడు కనిపిస్తాడు.
ఇంతకీ ఈ పాత్ర చేసింది ఎవరు అన్నది ఆసక్తికరం. ‘అఖండ-2’కు పాన్ ఇండియా అప్పీల్ తీసుకొచ్చేందుకు చాలామంది ఉత్తరాది నటులతో కీలక పాత్రలు చేయించారు. శివుడి పాత్ర చేసింది కూడా హిందీ నటుడే. తన పేరు.. తరుణ్ ఖన్నా. అతను హిందీ సీనియళ్లలో బాగా ఫేమస్. 2015లో వచ్చిన ‘సంతోషి మా’ సీరియల్లో అతను మహా శివుడి పాత్రనే చేయడం విశేషం. ఇంకా పలు సీరియళ్లలో అతను శివుడి వేషమే వేశాడు. ‘అఖండ-2’లో శివుడి పాత్రకు కూడా అతనే పర్ఫెక్ట్ అని బోయపాటి తరుణ్‌ను తీసుకొచ్చాడు. అతనా పాత్రకు బాగానే న్యాయం చేశాడని అందరూ ఏకగ్రీవంగా అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on December 13, 2025 9:01 pm
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘అఖండ-2’కు మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి…
టాలెంట్, రూపం రెండూ ఉన్న నటుడు ఆది పినిశెట్టి. మొదట హీరోగా పరిచయమైనా సరైనోడులో విలన్ గా మెప్పించాక ఒక్కసారిగా…
ఇప్పుడు పాడటం లేదు కానీ ఇరవై సంవత్సరాల క్రితం తెలుగు సంగీతంలో పాప్ మ్యూజిక్ అనే ఒరవడి తేవడంలో గాయని…
ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్‌లైన్‌ను మళ్లీ…
సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…