బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో రోజు కూడా తెల్లవారుఝాము, అర్ధరాత్రి షోలు వేసే స్థాయికి చేరుకోవడం అంటే మాములు విషయం కాదు. కేవలం పుష్ప 2, యానిమల్ లాంటివి మాత్రమే ఈ అరుదైన ఘనత దక్కించుకున్నాయి. అసలు విశేషం ఇది కాదు. ఎంత పెద్ద హిట్ అయిన సినిమాకైనా రెండో శుక్రవారం పెద్ద ఎత్తున వసూళ్లు దక్కవు. కానీ దురంధర్ ఆ రికార్డును సైతం బ్రేక్ చేసింది. సెకండ్ ఫ్రైడే 34 కోట్ల 70 లక్షల కలెక్షన్ నమోదు చేసి ఈ రికార్డు అందుకున్న తొలి ఇండియన్ మూవీగా మైలురాయి అందుకుంది.
ఇప్పటిదాకా ఈ ఘనత 27 కోట్ల 50 లక్షలతో పుష్ప టూ పేరు మీద ఉంది. దాన్ని పెద్ద మార్జిన్ తో దాటేయడం చూసి ట్రేడ్ నివ్వెరపోతోంది. రెండో వీకెండ్ పూర్తి కాకుండానే 300 కోట్లను దాటేసిన దురంధర్ నాలుగు వందల కోట్ల క్లబ్బులోకి అడుగు పెట్టేందుకు పరుగులు పెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ దీని దూకుడు మాములుగా లేదు. ఆశ్చర్యకరంగా హైదరాబాద్ మల్టీప్లెక్సుల్లో అఖండ 2 కన్నా వేగంగా దురంధర్ హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. ఈ ఉదాహరణ చాలు ఎంతగా ఈ మూవీ చొచ్చుకుపోయిందో అర్థం చేసుకోవడానికి. సోషల్ మీడియా మద్దతు ఈ విషయంలో చాలా బలంగా పని చేస్తోంది.
చూస్తుంటే ఫైనల్ రన్ అయ్యేలోపు అయిదు వందల కోట్లు దాటేయడం లాంఛనమే అనిపిస్తోంది. సక్సెస్ వచ్చాక టీమ్ ఫుల్ యాక్టివ్ అయిపోయింది. మాధవన్ అడిగినవాళ్లందరికీ ఇంటర్వ్యూలు ఇస్తుండగా దర్శకుడు ఆదిత్య ధార్ బయటికి వచ్చి విశేషాలు పంచుకుంటూ మెచ్చుకున్నవాళ్లకు థాంక్స్ చెబుతున్నారు. వచ్చే ఏడాది మార్చి 19 విడుదల కాబోయే దురంధర్ 2 రివెంజ్ కోసం ఫ్యాన్స్ అప్పుడే వెయిట్ చేయడం మొదలుపెట్టారు. నెట్ ఫ్లిక్స్ లో ఓటిటి స్ట్రీమింగ్ జరిగాక దురంధర్ సీక్వెల్ డిమాండ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పట్లో అయితే ఈ స్పీడ్ ఆగేలా లేదు.
This post was last modified on December 13, 2025 1:06 pm
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…
ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి…