రీఎంట్రీ తర్వాత వరుసగా మూడు రీమేక్‌లతో పలకరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది రెండు నెలల వ్యవధిలో రెండు స్ట్రెయిట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో మొదటిదైన ‘హరిహర వీరమల్లు’ తీవ్రంగా నిరాశపరిచినప్పటికీ.. రెండో చిత్రం ‘ఓజీ’ మాత్రం అభిమానులకు కోరుకున్న హై ఇచ్చింది. ఇక పవన్ చేతిలో ఉన్న చివరి చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా విడుదలకు సిద్ధం అవుతుండడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
పవన్‌తో ‘గబ్బర్ సింగ్’ లాంటి మెమొరబుల్ హిట్ ఇచ్చిన ఆయన వీరాభిమాని హరీష్ శంకర్ తీస్తున్న సినిమా కావడంతో ఇది కూడా ‘ఓజీ’ లాగే ఫ్యాన్ మూమెంట్స్‌తో అలరిస్తుందని ఆశిస్తున్నారు. కొన్ని నెలల ముందే ఈ సినిమాలో తన పార్ట్ వరకు షూట్ పూర్తి చేసేశాడు పవన్. మిగతా ప్యాచ్ వర్క్ కూడా పూర్తయినట్లే. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
గట్టిగా పని చేస్తే సినిమాను సంక్రాంతికి కూడా రిలీజ్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఆ పండక్కి చిరంజీవి సినిమా ‘మన శంకర వరప్రసాద్’ ఉండడంతో పవన్ వెనక్కి తగ్గాడు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను వేసవి ఆరంభంలో రిలీజ్ చేయాలని చూస్తోంది చిత్ర బృందం. ఐతే ప్రమోషన్లు చాలా ముందుగానే మొదలుపెట్టేస్తున్నారు. ముందుగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు. డిసెంబరులో అభిమానులకు పెద్ద ట్రీట్ ఉంటుందని కొన్ని రోజుల ముందే ఒక సోషల్ మీడియా పోస్టుతో ఊరించింది చిత్ర బృందం. ఈ రోజు దర్శకుడు హరీష్ శంకర్.. అతి త్వరలో అప్‌డేట్ రాబోతోందని.. సంబరాలకు సిద్ధంగా ఉండాలని పవన్ అభిమానులకు పిలుపునిచ్చాడు.
పవన్ ఇందులో మాంచి డ్యాన్స్ నంబర్స్ చేసినట్లు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. అందులో ఒక పాటను ఫస్ట్ సింగిల్‌గా రిలీజ్ చేయబోతున్నారు. దీంతో పాటు ఈ నెలలో మరో అప్‌డేట్ కూడా ఉంటుందని.. సంక్రాంతికి కూడా ట్రీట్ ఇస్తారని.. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని రిలీజ్ ముంగిట నెల రోజులు ప్రమోషన్లు గట్టిగా చేస్తారని సమాచారం. ‘పెద్ది’ రాని పక్షంలో మార్చి 26న ఈ సినిమా రిలీజవుతుంది. లేదంటే ఏప్రిల్లో విడుదల ఉండొచ్చు.
This post was last modified on December 7, 2025 1:59 pm
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…