నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకే కాదు పక్క రాష్ట్రాల ప్రొడ్యూసర్లు సైతం ఫేస్ చేస్తున్నారు. కార్తీ హీరోగా రూపొందిన వా వతియార్(తెలుగులో అన్నగారు వస్తారు) డిసెంబర్ 12 విడుదల కావాల్సి ఉంది. ఆ మేరకు అధికారిక ప్రకటన ఇచ్చి ప్రమోషన్లు మొదలుపెట్టారు. కానీ ఈలోగా మదరాసు హై కోర్టు దాన్ని ఆపుతూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అర్జున్ లాల్ సుందర్ దాస్ అనే వ్యక్తి తనకు రావాల్సిన 21 కోట్ల 78 లక్షలకు సంబంధించి కేసు వేయడంతో ఇప్పుడీ చిక్కుముడి వచ్చింది.
ఆ సొమ్మును చెల్లిస్తే అన్నగారు వస్తారుకి రూట్ క్లియర్ అవుతుంది. నిర్మాత జ్ఞానవేల్ రాజా కంగువ నుంచే పలు ఇబ్బందులు పడుతున్న వైనం గురించి మీడియాలో చాలా కథనాలు వచ్చాయి. అది డిజాస్టర్ కావడం తీవ్ర ప్రభావం చూపించింది. రెండో భాగం ఆగిపోయింది. స్వయంగా సూర్య బంధువు కావడంతో ఇప్పటిదాకా ఎలాంటి తీవ్ర పరిణామాలు చోటు చేసుకోలేదు. నిజానికి అన్నగారు వస్తారు చాన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది. ఏదోలా అన్ని క్లియర్ చేసుకుని డిసెంబర్ కు రెడీ అయ్యారు. తీరా చూస్తే ఇప్పుడీ ట్విస్టు మళ్ళీ ఆగిపోయేలా చేసింది. ఇంకో వారం టైం ఉంది కాబట్టి పరిష్కారం చేస్తారేమో.
కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన అన్నగారు వస్తారుకి నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించారు. కామెడీ టచ్ ఉన్న పోలీస్ ఆఫీసర్ గా కార్తీ ఇందులో విక్రమార్కుడు తరహా పాత్ర చేశాడు. ప్రోమోలు చూస్తే అదే అనిపిస్తోంది. ఇప్పటికైతే కార్తీ దీని గురించి స్పందించలేదు. ఆర్థిక చిక్కు కాబట్టి హీరో నుంచి రెస్పాన్స్ ఆశించలేం కానీ తనవంతు బాధ్యతగా ఏమైనా చొరవ తీసుకుని సాల్వ్ చేస్తాడేమో చూడాలి. జననాయకుడు, పరాశక్తి ఉన్నందుకు సంక్రాంతికి వాయిదా వేసే ఛాన్స్ లేదు. డిసెంబర్ 18 ప్రదీప్ రంగనాథన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది కాబట్టి మళ్ళీ క్రిస్మస్ కు వెళ్లాల్సి ఉంటుంది. చూడాలి ఏం చేస్తారో.
This post was last modified on December 5, 2025 6:41 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…