టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సమంత వ్యక్తిగత జీవితం ఎప్పుడూ చర్చనీయాంశమే. గత కొన్నేళ్లలో విడాకులు, అనారోగ్య సమస్యలతో సతమతం అయిన ఆమె ఈ మధ్య చాలా హుషారుగా కనిపించడం తన అభిమానులకు సంతోషాన్నిచ్చింది. ఇప్పుడామె మళ్ళీ పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడడం వారికి మరింత ఆనందాన్నిచ్చింది.
కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం వివాహం చేసుకున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులో సద్గురు జగ్గీ వాసుదేవ్ నిర్వహించే ఈషా ఫౌండేషన్‌లో వీరి పెళ్లి జరిగింది. కొన్ని నెలలుగా అక్కడికి తరచుగా వెళ్తున్న.. సమంత, రాజ్ అక్కడే పెళ్లి కూడా చేసుకున్నారు.
ఈ పెళ్లి సాధారణంగా జరిగింది కాదని.. దీనికి విశిష్టత ఉందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈషా యోగ కేంద్రంలోని లింగ భైరవి సన్నిధిలో.. సమంత, రాజ్ పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్నారట. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లిని యోగ సంప్రదాయం ప్రకారం నిర్వహించారట.
ఆలోచనలు, భావోద్వేగాలు, భౌతిక సంబంధానికి అతీతంగా.. దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి రూపొందించిన విశిష్టమైన పవిత్ర ప్రక్రియగా ఈ ‘భూత శుద్ధి వివాహం’ గురించి చెబుతున్నారు. లింగ భైరవి ఆలయాలు.. శుద్ధి చేసిన ప్రత్యేక ప్రదేశాల్లో నిర్వహించే ఈ వివాహ ప్రక్రియ వధూవరుల దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేస్తుందట. ఇలా పెళ్లి చేసుకున్న దంపతుల జీవితాల్లో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా దైవానుగ్రహం పొందుతారట. సమంత, రాజ్ ఇద్దరికి ఇది రెండో వివాహం. ఏ కలతలు లేకుండా ఈ బంధం సాగిపోయేలా ఇద్దరూ భూత శుద్ధి వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on December 1, 2025 9:25 pm
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…