Movie News

ముంచెత్తుతున్న మహేష్-తారక్ వీడియోలు

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వచ్చాక ఒక వ్యక్తి అందుబాటులో లేకపోయినా.. కేవలం వాళ్ల ఫొటోలను వాడి వాళ్లు నటిస్తున్నట్లు, మాట్లాడుతున్నట్లు వీడియోలు, ఆడియోలు రెడీ చేసేస్తున్నారు. క్రమంగా వీటిలో పర్ఫెక్షన్ కూడా కనిపిస్తోంది. దీంతో ఏది ఒరిజినల్, ఏది ఫేక్ అని కనిపెట్టడం కూడా కష్టమవుతోంది. వీటి వల్ల వివాదాలు కూడా తలెత్తుతున్నాయి.

ఐతే ఫేక్ అనిపించకుండా, ఎవ్వరినీ నొప్పించకుండా అదే సమయంలో ఏఐ సాయంతో అందరినీ ఆకట్టుకునే హృద్యమైన వీడియోలు కూడా తయారవుతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలను చిన్న పిల్లల్లా చూపించి షార్ట్ స్టోరీస్‌‌ను అందంగా చెబుతూ రూపొందిస్తున్న వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇందులో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌లతో రూపొందిస్తున్న వీడియోలు హైలైట్‌గా ఉంటున్నాయి.

మహేష్, తారక్‌లను బెస్ట్ ఫ్రెండ్స్‌లా చూపిస్తూ.. వాళ్లు పేద వాళ్లుగా ఉంటే ఎలా ఉంటుందో షార్ట్ స్టోరీస్ ద్వారా చూపిస్తున్నారు ఈ వీడియోల్లో. డబ్బుల్లేక ఇబ్బంది పడుతూ.. అవమానాలు ఎదుర్కొంటూ.. కష్టపడి పైకి ఎదిగి తాము కోరుకున్నది సాధించుకునే కాన్సెప్ట్‌లతో ఈ వీడియోలు చేస్తున్నారు. రకరకాల సిచువేషన్లు తీసుకుని ఎంతో హృద్యంగా వీటిని తీర్చిదిద్దుతున్నారు. వీటి నిడివి నిమిషంలోపే ఉంటోంది.

పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, అజిత్, విజయ్.. ఇలా చాలామందిని ఇందులో భాగం చేస్తున్నారు. ఈ స్టార్ హీరోల లుక్స్.. వాళ్ల హావభావాలు చాలా క్యూట్‌గా ఉంటున్నాయి. హృద్యమైన సంగీతం కూడా తోడవుతుండడంతో ఈ వీడియోలు భలేగా అనిపిస్తున్నాయి. వీటికి వ్యూస్ కూడా కోట్లల్లో ఉంటున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పుడీ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

This post was last modified on November 18, 2025 7:19 pm

Share

Recent Posts

ఇది కియారా అద్వానీకే సాధ్యం

ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ మంచి ఊపులో సాగుతుంటే వాళ్లు పెళ్లి జోలికి వెళ్లేవాళ్లు కాదు. అవకాశాలు తగ్గిపోయి, ఫేడవుడ్ అవుతున్న…

23 minutes ago

మహా కథ మళ్ళీ కంచెర్లపాలెంకే

మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా రూపొందించిన ‘రావు బహదూర్’ సినిమా మీద టీం అంతా చాలా…

30 minutes ago

నష్టాలు వచ్చాయని ఒప్పుకున్న నాని

తమ సినిమాలు థియేటర్లలో ఉండగా అందులో లోపాల గురించి.. దాని మీద వచ్చే విమర్శల గురించి, కలెక్షన్లు తక్కువ రావడం…

47 minutes ago

చివరి మ్యాచ్‌లోనూ అదే మెస్సీ… వారసుడికే గోల్ ఇచ్చి వెళ్లాడు!

21 ఏళ్ల కెరీర్‌లో అర్జెంటీనా కోసం ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో మార్చిన లియోనెల్ మెస్సీ.. చివరి మ్యాచ్‌లోనూ తన మార్క్…

52 minutes ago

అక్కడ కలెక్షన్ల వర్షం… ఇక్కడ వసూళ్ల నీరసం

కొన్ని సినిమాలు నేటివిటీ మీద ఆడతాయి. ఒక చోట బ్లాక్ బస్టర్ అయినంత మాత్రాన పక్కన కూడా అదే రిజల్ట్…

2 hours ago

వరప్రసాద్ స్నేహితులకు ఒకే సమస్య

మన శంకరవరప్రసాద్ గారులో ఫ్రెండ్స్ గా నటించిన చిరంజీవి, వెంకటేష్ కు ఒకే సమస్య వచ్చింది. అదేంటంటే తక్కువ గ్యాప్…

3 hours ago