Movie News

లీకులు ఇస్తున్నారా వస్తున్నాయా

చిన్న సినిమాలకు ప్రమోషన్లు చాలా కీలకం. కాకపోతే దానికి సరిపడా బడ్జెట్ అందరి దగ్గరా ఉండదు. ఏదో ఒక వైరల్ కంటెంట్ క్రియేట్ చేయనిదే ఆడియన్స్ దృష్టిలో పడలేం. లిటిల్ హార్ట్స్ సక్సెస్ వెనుక మంచి పబ్లిసిటీ క్యాంపైన్ ఉంది. బన్నీ వాస్ తో మొదలుపెట్టి విజయ్ దేవరకొండ దాకా అందరూ అండగా నిలవబట్టి పెద్ద స్థాయి విజయం అందుకుంది. ఇవి లేకనే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మంచి టాక్, రివ్యూలు తెచ్చుకుని మరీ థియేట్రికల్ ఫెయిల్యూర్ అయ్యింది. వీటి సంగతి పక్కనపెడితే త్వరలో విడుదల కాబోతున్న ఒక చిన్న సినిమాకు బాక్సాఫీస్ వద్ద టఫ్ కాంపిటీషన్ ఉంది. దీన్నెలా ఎదురుకోవాలో  అర్థం కాలేదు.

దీంతో క్లైమాక్స్ కు సంబంధించిన ఒక ముఖ్యమైన లీకుని బయటికి వదిలారు. హీరో పాత్రకు సంబంధించి షాకింగ్ అనిపించే ఆ ట్విస్ట్ చూసి యూత్ షాక్ అయిపోయి కొందరు దీనికోసమైనా చూడాలని ఫిక్స్ అవ్వగా, మరికొందరు ఎమోషన్ పేరుతో మరీ ఇంత రిస్క్ చేయడం భావ్యం కానీ నెగటివ్ కామెంట్స్ ఇస్తున్నారు. ఆ సినిమా ఏదీ, ఏంటా మలుపు అనే దాని కన్నా అసలు ఇది ఎలా బయటికి వచ్చిందనేది పెద్ద ప్రశ్న. కానీ ఇదంతా ఇప్పుడా టీమ్ కు చేస్తున్న మేలే ఎక్కువ. పాజిటివో నెగటివో ఏదో ఒకటి సోషల్ మీడియా జనాల మధ్య టాపిక్ గా మారిపోయింది. ఇదే ఓపెనింగ్స్ తెచ్చినా ఆశ్చర్యం లేదు.

ఈ స్ట్రాటజీనే మైనస్ అయ్యే ప్రమాదం లేకపోలేదు. ఎందుకంటే చివర్లో ఏం జరుగుతుందో ముందే తెలిసిపోతే థ్రిల్ తో పాటు సదరు ఎమోషన్ కూడా తగ్గిపోతుంది. అదే జరిగితే ఆడియన్స్ నుంచి బయటికి వచ్చే టాక్ లో మార్పు రావొచ్చు. సరే రిస్క్ తీసుకుని ఇన్ఫో వదిలారు అది ఎలాంటి ఫలితం ఇస్తుందో తేలాలంటే ఇంకొద్ది రోజులు ఆగాలి. అయినా లీకులతో సినిమాలను చంపేస్తున్నారని ఒకపక్క సీనియర్ నిర్మాతలు గగ్గోలు పెడుతుంటే చిన్న ప్రొడ్యూసర్లు అచ్చం దానికి రివర్స్ లో లీకులు తాముగా ఇచ్చేస్తున్నారు. సరే ఎవరి మార్కెటింగ్ వారిది. ఎవరినీ రాంగ్ అనలేం. ఫైనల్ తీర్పు జనాలదే.

This post was last modified on November 17, 2025 10:08 pm

Share

Recent Posts

మ‌హావ‌తార న‌ర‌సింహ.. తెలుగు రైట‌ర్ ఆవేద‌న‌

మ‌హావ‌తార న‌ర‌సింహ‌.. గ‌త ఏడాది పాన్ ఇండియా స్థాయిలో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సినిమా. ఈ యానిమేష‌న్ మూవీ రిలీజ‌య్యే…

1 hour ago

ఛలో దర్శకుడిని తిట్టారా పొగిడారా

టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుల్లో వెంకీ కుడుముల పేరు ఖచ్చితంగా ఉంటుంది. రష్మిక మందన్న ఇవాళ ఈ స్థాయికి వచ్చిందంటే ఛలో…

2 hours ago

లిఫ్ట్ అడిగేటప్పుడు జాగ్రత్త మహిళలు

మహిళల భద్రతపై మరోసారి ఆందోళన కలిగించే ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. ఇంటికి వెళ్లేందుకు ఆటోలో లిఫ్ట్ ఇస్తామని నమ్మించిన ఇద్దరు…

2 hours ago

అక్రమ సంబంధాల వివాదం… మళ్ళీ సీఈవోగా వస్తానంటున్న జెన్సెన్

ప్రపంచ టెక్ రంగంలో సంచలనం సృష్టించిన ఎన్విడియా మాజీ సీఈవో జెన్సెన్ హువాంగ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. వివాహేతర…

2 hours ago

పాపం… ట్రైన్ ఎక్కిద్దాం అని వెళ్ళి ఫైన్ కట్టి వచ్చారు

బంధువులను రైలు ఎక్కించడానికి వెళ్లినవాళ్లు అనుకోకుండా అదే రైలులో ప్రయాణించాల్సి వచ్చింది. పైగా టికెట్లు లేకపోవడంతో ఏకంగా రూ.36,140 చెల్లించాల్సి…

2 hours ago

చిరు లీక్స్ రొటీన్ అవుతున్నాయా

మెగాస్టార్ చిరంజీవి స్క్రీన్ మీదే కాదు స్టేజి పైన ఉన్నప్పుడు కూడా ఆయన ఎనర్జీ వేరే లెవెల్ లో ఉంటుంది.…

2 hours ago