స్టార్ హీరోయిన్లు చాలామంది పెళ్లి తర్వాత సినిమాలు మానేసిన వాళ్లే. కానీ అందరూ ఇదే బాట పడతారని అనుకోవడానికి లేదు. వివాహం తర్వాత కూడా కెరీర్‌ను బాగా నడిపిస్తున్న వాళ్లూ ఉన్నారు. కాజల్ అగర్వాల్ కూడా ఈ జాబితాలో చేరేలాగే ఉంది. ఆమె పెళ్లి జరిగే సమయానికి ‘ఆచార్య’, ‘ఇండియన్-2’ లాంటి భారీ చిత్రాలు తన చేతిలో ఉన్నాయి. పెళ్లి తర్వాత ఈ సినిమాలు చేసేసి కాజల్ ఊరుకుంటుందని అనుకున్న వాళ్లూ ఉన్నారు. కానీ తనకలాంటి ఉద్దేశాలేమీ లేవని చందమామ చెప్పకనే చెప్పింది. పెళ్లి తర్వాత ఆమె కొత్తగా ఓ సినిమా ఒప్పుకుంది. ఇది ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా కావడం.. అలాగే కాజల్ ఇంతవరకు చేయని జానర్లో తెరకెక్కబోతుండటం విశేషం.
కాజల్ ఇంతకుముందు జీవా సరసన తమిళంలో ‘కవలై వేండాం’ అనే సినిమాలో నటించింది. తెలుగులో ఈ చిత్రం ‘ఎంత వరకు ఈ ప్రేమ’ పేరుతో అనువాదమైంది. ఆ చిత్రం పెద్దగా ఆడకపోయినా దాని దర్శకుడు డీకే మీద కాజల్‌కు బాగా కుదిరినట్లుంది. అతడి దర్శకత్వంలో ఓ హార్రర్ థ్రిల్లర్ చేయడానికి ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం.
ఇందులో మరో ముగ్గురు కథానాయికలు కీలక పాత్రలు పోషిస్తారట. ఈ సినిమా కోసం ఇప్పటికే కాజల్ లుక్ టెస్ట్‌లోనూ పాల్గొందట. అంతా ఓకే అనుకున్నాక ఈ సినిమాకు సంతకం చేసిందట. ఆమె త్వరలోనే ‘ఆచార్య’ చిత్రీకరణలో పాల్గొనబోతోంది. ‘ఇండియన్-2’ ఎప్పుడు పున:ప్రారంభం అయ్యేది మాత్రం ఇంకా స్పష్టత లేదు. మరోవైపు దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘హేయ్ సినామికా’లోనూ కాజల్ ఓ కీలక పాత్ర చేస్తోంది. ఇందులో అదితిరావు హైదరి మరో కథానాయిక. మొత్తానికి పెళ్లి తర్వాత కూడా కాజల్ ఇంత బిజీగా ఉండటం విశేషమే.
This post was last modified on December 2, 2020 3:34 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…