విలన్ ఎంత బలంగా ఉంటే హీరో పాత్ర అంతగా ఎలివేట్ అవుతుందన్నది సినిమాల్లో ప్రాథమిక సూత్రం. ఈ విషయం అర్థం చేసుకున్న దర్శకులు ఆ పాత్రల్ని బలంగా తీర్చిదిద్దడానికి, ఆ పాత్రల కోసం స్టేచర్ ఉన్న ఆర్టిస్టులను తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. మాస్ రాజా రవితేజ హీరోగా తాను తెరకెక్కించబోయే కొత్త సినిమా ‘ఖిలాడి’ కోసం రమేష్ వర్మ ఓ సూపర్ విలన్‌ను ఓకే చేసినట్లు సమాచారం. ఆ విలన్ మరెవరో కాదు.. యాక్షన్ కింగ్ అర్జున్.
కెరీర్లో చాలా వరకు హీరోగా నటించిన అర్జున్.. క్యారెక్టర్ రోల్స్ చేయడం మొదలయ్యాక అప్పుడప్పుడూ విలన్ పాత్రల్లోనూ మెరుస్తున్న సంగతి తెలిసిందే. విశాల్ సినిమా ‘అభిమన్యుడు’లో అతడి విలన్ పాత్రకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. హీరో పాత్రను మించి అది హైలైట్ అయింది. అలాగే తెలుగులో ‘లై’ సినిమాలోనూ విలన్‌గా మెరిశాడు అర్జున్. ఆ చిత్రం సరిగా ఆడకపోయినా అర్జున్ పాత్ర, నటన మాత్రం అందరినీ ఆకట్టుకున్నాయి.
ఇప్పుడు ‘ఖిలాడి’ సినిమాలోనూ విలన్ పాత్ర ప్రత్యేకమైంది కావడంతో దానికి అర్జున్‌ను అడగడం, అతను ఓకే చెప్పడం జరిగాయట. రవితేజ సినిమాలో అర్జున్ విలన్ అంటే ఆ కాంబినేషన్‌పై ప్రత్యేక ఆసక్తి నెలకొని, సినిమాపై అంచనాలు పెరగడానికి అవకాశముంటుంది. ‘ఖిలాడి’ ఓ తమిళ చిత్రానికి రీమేక్ అనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో ఆ చిత్రం ఇంకా విడుదలే కాకపోవడం విశేషం.
అరవింద్ స్వామి, త్రిష జంటగా నటించిన ‘శతురంగ వేట్టై-2’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఐతే మంచి సబ్జెక్టుతో తెరకెక్కిన ఈ హైస్ట్ థ్రిల్లర్‌ను రవితేజ కోసం ఎంచుకున్నాడట రమేష్ వర్మ. గత ఏడాది రమేష్ వర్మ తీసిన మరో తమిళ రీమేక్ ‘రాక్షసుడు’ మంచి విజయాన్నందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాను నిర్మించిన కోనేరు సత్యనారాయణనే ‘ఖిలాడి’ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
This post was last modified on December 2, 2020 3:32 pm
సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ… తన పేరు ముందు ఉన్న బిరుదు మాదిరిగా ప్రతి విషయాన్ని సెన్సేషనల్ గానే చేసుకుంటూ…
ఇవాళ సంక్రాంతికి వస్తున్నాం టీమ్ బాక్సాఫీస్ సంభవం పేరుతో ప్రెస్ మీట్ నిర్వహించింది. హీరో వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడితో…
రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి, ఫలితాలు తేలిపోయాయి కాబట్టి మూవీ లవర్స్ ఫ్రెష్ గా రిలీజయ్యే…
అవును.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త పోలీస్ బాస్ రానున్నారు. ఈ అంశంపై ఎవరు వస్తారన్న దానిపై ఇప్పటివరకున్న కన్ఫ్యూజన్ ఒక…
ఎంత తలలు పండిన దర్శకులైనా రెండు మూడు హిట్లు పడ్డాక ఫ్లాపులు చూడటం సహజం. కెవి రెడ్డి, మణిరత్నం దగ్గర…
గత కొన్నేళ్లలో అర్ధ శతదినోత్సవం, హండ్రెడ్ డేస్ పదాలు అరుదైపోయాయి. ఏ సినిమా అయినా ఎన్ని వందల కోట్లు వసూలు…