ఎఫ్ 2 చిత్రం అంత పెద్ద హిట్ అవుతుందని దిల్ రాజు అప్పుడనుకోలేదు. అందులో నటించిన వెంకటేష్, వరుణ్ తేజ్ కూడా అంత రెవెన్యూ ఊహించలేదు. అందుకే ఆ చిత్రంలో నటించడానికి వెంకీ ఆరు కోట్లు, వరుణ్ మూడు కోట్లు మాత్రం తీసుకున్నారు. కానీ దాని సీక్వెల్ చేయడానికి మాత్రం వెంకీ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్నాడు.
వెంకటేష్‌కి ఎంత ఇస్తే తనకూ అంతే ఇవ్వాలని వరుణ్ తేజ్ పట్టుబట్టాడు. వెంకటేష్‌కి వాటాల ప్రకారం పన్నెండు కోట్లు ఇవ్వాల్సి వస్తుందట. అంత మొత్తం వరుణ్ తేజ్కీ ఇవ్వాలంటే దిల్ రాజుకి బడ్జెట్ కంట్రోల్లో వుండదనే భయం పట్టుకుంది. పైగా అనిల్ రావిపూడి రేంజ్ కూడా పెరిగిందిపుడు. అందుకే ఈ చిత్రానికి ముగ్గురికీ చెరో పది కోట్లు ఇవ్వడానికి దిల్ రాజు ఓకే అన్నాడట.
అటుపై లాభాలు బాగా వస్తే కొంత షేర్ ఇస్తానని మాట ఇచ్చాడట. అసలే కరోనా వల్ల దిల్ రాజు చాలా నష్టపోయాడు. అందుకే ఇప్పుడు అయిదారు కోట్ల దగ్గర కూడా కాస్త గట్టిగానే వుంటున్నాడు. దిల్ రాజు ఇచ్చిన డీల్‌కి హీరోలిద్దరూ ఓకే చెప్తే వచ్చే జనవరిలోనే ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది. సమ్మర్‌కి ఫినిష్ చేసి మే లేదా జూన్‌లో విడుదల చేసేసేలా ప్రణాళిక వేసుకున్నారు.