బిగ్‍బాస్ సీజన్ 4లో ఈ వారం అవినాష్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. గత వారమే అతను ఎలిమినేట్ అవుతాడని బిగ్‍బాస్ ముందే గ్రహించి అతనికి ఏకంగా ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇచ్చింది. అయితే తాను ఎలిమినేట్ అవడమేంటని, తాను చాలా స్ట్రాంగ్ అని అవినాష్ అప్పుడు నాగార్జునతోనే వాదనకు దిగాడు.
అక్కడితో ఆగకుండా ఆ రొంపి నామినేషన్ పర్వంలోకి తెచ్చి మోనల్ తనకంటే వీక్ అని, ఆమెని ఎలిమినేట్ చేయకుండా జనం తనను ఎలిమినేట్ చేయడమేంటని రభస చేసాడు. దీంతో అసలే మిణుకు మిణుకుమంటోన్న తన ఫైనల్ అవకాశాన్ని తానే ముక్కుతో ఊదేసుకున్నట్టయింది.
అంత గొప్పగా గేమ్ ఆడిన మెహబూబ్ ఎలిమినేట్ అయిపోతే నువ్వెంత అన్నప్పుడు తాను గొప్పగా ఆడాను కనుకే ఇందాకా వచ్చానని అన్నాడు. అసలు తాను గొప్పగా ఆడినట్టు ఫీలయిపోతున్న అవినాష్ చేసిందేంటి? పెళ్లి కాలేదు, సంబంధాలు చూస్తున్నారు అంటూ మొదలు పెట్టిన అవినాష్ పది వారాల నుంచీ అదే జోకుని జనాల నెత్తిన రుద్దుతూ చీకాకు పెట్టించాడు. ఎప్పటికప్పుడు నామినేషన్లలోకి రాకుండా తప్పించుకోవాలని చూసి ఇంతవరకు రాగలిగాడు. బిగ్‍బాస్ అండదండలు లేకపోతే ఎప్పుడో అవుట్ అయిపోయేవాడు.
అతడు ఫైనల్ ఫైవ్‍కి అనర్హుడని బిగ్ బాస్ టీమ్‍కి కూడా అనిపించిందో ఏమో ఇప్పుడు వాళ్లు అతడిని ఫుల్‍గా ఎక్స్పోజ్ చేస్తున్నారు. గతంలో అతడి తప్పులన్నీ ఎడిట్ చేసేసిన వాళ్లే ఇప్పుడు స్క్రీన్ టైమ్ ఇచ్చి మరీ వెళ్లగొడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates