Movie News

హీరోనా.. పెళ్లా.. దేవి ఛాయిస్?

తెలుగు సినిమా సంగీతంలో గత రెండు దశాబ్దాలుగా దేవిశ్రీ ప్రసాద్‌దే ఆధిపత్యం. తమన్ సహా పలువురు సంగీత దర్శకుల నుంచి గట్టి ఎదురైనప్పటికీ తట్టుకుని ఇప్పటికీ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు దేవి. టాలీవుడ్లో అందరు అగ్ర హీరోలతోనూ అతను సినిమాలు చేశాడు. ఇప్పుడు కెరీర్లో తొలిసారిగా అతను హీరో అవతారం ఎత్తబోతున్నాడు.

‘బలగం’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన కమెడియన్ వేణు దర్శకత్వంలో ‘యల్లమ్మ’ సినిమా చేయబోతున్నాడు. ఈ కథ అటు ఇటు తిరిగి చివరికి దేవి వద్దకు వచ్చింది. ఐతే ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరోవైపు దేవి పెళ్లి గురించి ఎప్పట్నుంచో చర్చ జరుగుతున్నా.. ఇంకా అది కార్యరూపం దాల్చలేదు. ఇలాంటి టైంలో జగపతిబాబు నిర్వహించే టాక్ షోకు అతిథిగా వచ్చాడు దేవి. ఆ కార్యక్రమంలో పెళ్లి, హీరో.. ఈ రెంటిలో నీ ఛాయిస్ ఏది అంటూ ఆసక్తికర ప్రశ్న వేశాడు జగపతిబాబు.

దీనికి దేవి స్పష్టమైన సమాధానం ఇచ్చాడు. హీరో అనే కాదు.. ఇంకే ఆప్షన్ పక్కన పెళ్లి అనే మాట పెట్టినా సరే.. పెళ్లి కాకుండా మరొకటే ఎంచుకుంటానని స్పష్టం చేశాడు దేవి. ముందు హీరో కావడమే తన లక్ష్యమని అతనన్నాడు. హీరో అవుదామని ఎప్పట్నుంచో కథలు వింటున్నట్లు చెప్పిన దేవి.. ‘యల్లమ్మ’ సినిమా చేయబోతున్న విషయాన్ని మాత్రం ధ్రువీకరించలేదు. మరోవైపు తన జీవితంలో మరపురాని అనుభవం గురించి చెబుతూ.. ఇళయరాజాను జీవితంలో ఒక్కసారైనా కలవాలని తాను కలలు కన్నానని, అలాంటిది గత ఏడాది ఆయనే తన స్టూడియోకు రావడం గొప్ప అనుభూతి అని దేవి చెప్పాడు.

తన పాటకు చిరంజీవిలా ఇంకెవరూ న్యాయం చేయలేరని.. సంగీత దర్శకత్వంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి తన పాటకు ఆయన డ్యాన్స్ చేయాలి అని తపించానని.. శంకర్ దాదా సినిమాతో అది సాధ్యమైందని.. ఇప్పుడు కూడా చిరు తన పాటకు డ్యాన్స్ చేస్తే అలా చూస్తూ ఉండిపోతానని అతనన్నాడు. తన పాటల్లో ‘ఖడ్గం’ సినిమాలోని ‘నువ్వు నువ్వు’ చాలా స్పెషలన్న దేవి.. ‘ఆర్య’లోని ‘అ అంటే అమలాపురం’ పాటకు చాలా కష్టపడ్డట్లు వెల్లడించాడు.

This post was last modified on November 4, 2025 10:11 am

Share
Show comments
Published by
Kumar
Tags: DSP

Recent Posts

ఇక రిటైర్మెంట్ మాటెత్తకండి… ఇది కింగ్ కోహ్లీ 2.0

రాయ్‌పూర్ వేదికగా మరోసారి విరాట్ కోహ్లీ బ్యాట్ గర్జించింది. "కోహ్లీ పని అయిపోయింది, వయసు మీద పడింది" అని విమర్శించే…

1 hour ago

అబ్బాయ్ హిట్టిచ్చాడు… బాబాయ్ బ్లాక్ బస్టరివ్వాలి

ఒకే కుటుంబం నుంచి రెండు తరాలకు చెందిన స్టార్ హీరోలతో జోడిగా నటించే ఛాన్స్ అందరికీ రాదు. అప్పుడెప్పుడో శ్రీదేవి…

2 hours ago

గూగుల్ డేటా సెంట‌ర్‌.. ఊహించ‌నంత వేగంగా!

విశాఖ‌ప‌ట్నంలో ఏర్పాటు చేయాల‌ని నిర్ణయించుకున్న గూగుల్ డేటా కేంద్రం.. ఊహించ‌ని వేగంగా ముందుకు క‌దులుతోంది. భూ సమీక‌ర‌ణ విష‌యంలో ప్ర‌భుత్వం…

2 hours ago

ఐ బొమ్మ రవికి పోలీస్ శాఖ బంపర్ ఆఫర్?

ఐ బొమ్మ రవి…ఈ మధ్యకాలంలో ఈ పేరు చాలా పాపులర్ అయింది. పేద, మధ్య తరగతి సినీ ప్రేక్షకులు రవిని…

2 hours ago

విమానాలకు ‘బ్లూ స్క్రీన్’ ఎఫెక్ట్.. ఆగిపోయిన ఫ్లైట్లు!

దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో మళ్లీ గందరగోళం మొదలైంది. ప్రయాణికులు చెక్ ఇన్ చేసుకోవడానికి కౌంటర్ల ముందు బారులు తీరుతున్నారు. ఎందుకంటే, విమానాశ్రయ…

2 hours ago

నా కేసు క్లోజ్ చెయ్యడానికి 25 ఏళ్ళా… స్టార్ హీరో అసహనం

90వ దశకంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబయి పేలుళ్ల సందర్భంగా అక్రమంగా ఆయుధాలు దాచిపెట్టిన కేసులో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్…

2 hours ago