ఈ వారం మినహాయిస్తే జనవరి 9 సరిగ్గా అరవై రోజుల దూరంలో ఉంది. అంటే ది రాజా సాబ్ విడుదలకు ఉన్న నిడివన్న మాట. అయితే ఇప్పటిదాకా రెండు టీజర్లు వచ్చాయి కానీ ఒక్క లిరికల్ సాంగ్ కూడా రిలీజ్ కాలేదు. తమన్ చూస్తేనేమో అఖండ 2 పనుల్లో బిజీగా ఉంటూ వాటి తాలూకు ఫోటోలు షేర్ చేసుకుంటున్నాడు కానీ రాజా సాబ్ గురించి సమాచారం ఇవ్వడం లేదు. నిర్మాత టిజి విశ్వప్రసాద్ సందర్భం వచ్చిన ప్రతిసారి వాయిదా లేదనే రీతిలో సంకేతాలు ఇస్తున్నారు. కానీ ఇన్ సైడ్ టాక్ అయితే టీమ్ మెడ మీద ఒత్తిడి కత్తి వేలాడుతోందట. ఇటలీ షెడ్యూల్ చేసుకుని వచ్చిన తర్వాత ఇది మరింత పెరిగిందని టాక్.
రాజా సాబ్ మీద ప్రెజెర్ ఎందుకు వచ్చిందనే దానికి రీజన్స్ ఉన్నాయి. మొదటిది విఎఫెక్స్. క్వాలిటీ కోసమే ఏకంగా కంపెనీనే మార్చేసిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ గ్రాఫిక్స్ నాణ్యత విషయంలో రాజీ పడకూడదనే సంకల్పంతో ఉంది. మిరాయ్ కే అంత అవుట్ ఫుట్ చూపించినప్పుడు సహజంగానే రాజా సాబ్ మీద డబుల్ అంచనాలు ఉంటాయి. వాటిని అందుకోవాలి. రెండోది రీ రికార్డింగ్ కోసం తమన్ కు తగినంత సమయం ఇవ్వాలి. అంటే డిసెంబర్ కీలక భాగం కేటాయించాలి. ప్యాచప్ తో కలిపి ఇంకో పాతిక రోజుల షూట్ బ్యాలన్స్ ఉందనే టాక్ అంతర్గతంగా ఉంది. ఇది నిజమో కాదో టీమ్ నిర్ధారణ చేయాలి.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే సంక్రాంతికి పోటీ పడుతున్న సినిమాల్లో ఎవరూ వెనక్కు తగ్గే అవకాశం లేకపోవడం రాజా సాబ్ స్క్రీన్ కౌంట్ మీద ప్రభావం చూపించనుంది. అందరికంటే ముందు వచ్చినా మూడు రోజుల తర్వాత నుంచే కొత్త సినిమాలకు దారి ఇవ్వాల్సి ఉంటుంది. మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, జన నాయకుడు, పరాశక్తిలతో పాటు నారి నారి నడుమ మురారి వచ్చే ఛాన్స్ ఉంది. బాహుబలి నుంచి సోలోగా వస్తున్న ప్రభాస్ కు ఇదంతా ఇబ్బంది కలిగించే కాంపిటీషనే. ఇది పక్కనపెడితే రాజా సాబ్ ఇకపై ఎలాంటి బాంబు వేయకుండా జనవరి 9నే రావాలని ఫ్యాన్స్ మొక్కేసుకుంటున్నారు.
This post was last modified on November 2, 2025 6:05 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…