ప్రపంచమంతటా కరోనా విజృంభణ కొనసాగుతూ వుంటే… ఏదో కరోనా ఫ్రీ ప్రాంతమన్నట్టు మాల్దీవులకు భారతీయ సినీ, టెలివిజన్ తారలందరూ విహారానికి వెళుతుండడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అలా వెళ్లిన వారిలో మన సమంత, రకుల్ ప్రీత్ సింగ్ కూడా వున్నారు. అయితే మరెక్కడికీ వెళ్లకుండా అందరూ మాల్దీవులకే ఎందుకు వెళ్తున్నారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఒక బాలీవుడ్ నటుడు సదరు గుట్టు రట్టు చేసేసాడు.
మాల్దీవులకు హాలిడేకు రావాలంటూ తనకూ ఆహ్వానం వచ్చిందని, ఫ్లయిట్ ఖర్చులతో పాటు అక్కడున్నన్ని రోజులకు అవసరమయ్యే వసతులన్నీ తామే భరిస్తామంటూ పలు రిసార్టుల నుంచి పిలుపు వచ్చిందట. కాకపోతే అక్కడున్న టైమ్‍లో తమ రిసార్ట్ని హైలైట్ చేస్తూ ఇన్‍స్టాగ్రామ్‍లో అప్‍డేట్స్ ఇవ్వాలని అడిగారట. అతను వెళ్లలేదు కానీ అక్కడకు వెళ్లిన మిగతా వారి గురించిన గుట్టు చెప్పేసాడు.
కరోనా వల్ల టూరిజం మీద ఆధార పడ్డ ప్రాంతాలన్నీ దారుణంగా దెబ్బతిన్నాయి. మాల్దీవుల్లోని రిసార్ట్ ఓనర్లు ఈ విధంగా భారతీయ తారలను ఆకర్షించి తద్వారా మిగతా జనాలను రాబట్టాలని చూస్తున్నారు. ఎంతమంది వెళుతున్నారనేది పక్కన పెడితే మాల్దీవులకు వెళ్లి తీరాలనే జనం మాత్రం సోషల్ మీడియాలో బాగానే పెరిగారు. ఒక్కసారి కరోనా ఫ్రీ అనే న్యూస్ వస్తే ఇప్పుడు పెట్టిన ఖర్చులకు ఎన్నో ఇంతల లాభాలు చూడొచ్చు.
This post was last modified on November 30, 2020 8:48 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…