కరోనా-లాక్ డౌన్ వల్ల సినీ రంగానికి కలిగిన ఓ ప్రయోజనం.. చిన్న సినిమాలను పెద్ద ఎత్తున ఓటీటీలు కొనుగోలు చేసి నేరుగా రిలీజ్ చేయడం. మామూలుగా అయితే చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం చాలా కష్టం. దొరికినా సరే.. అవి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి వారిని థియేటర్లకు రప్పించడం ఇంకా కష్టమయ్యేది. ఏటా వందకు అటు ఇటుగా చిన్న సినిమాలు రిలీజైతే అందులో మూడో నాలుగో మాత్రమే థియేటర్లలో బాగా ఆడేవి.
చిన్న సినిమాలకు టాక్ బాగున్నా కూడా అవి థియేటర్లలో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టడం కష్టమే. మామూలుగా జనాలు థియేటర్లకు వెళ్లి చూడాలంటే ఆ చిత్రాలకు స్టార్ వాల్యూ ఉండాలి. చిన్న సినిమాలు బాగున్నాయన్నా కూడా థియేటర్లకు వెళ్లి చూడాలనుకునేవాళ్లు తక్కువ. సినిమా అసాధారణంగా ఉందనిపించాలి. ఏదో సంచలనాత్మకంగా ఉండాలి. అలాంటపుడే చిన్న సినిమాలకు థియేటర్లు నిండుతాయి.
ఈ పరిస్థితుల్లో చాలా చిన్న సినిమాలు థియేటర్లలోకి వచ్చింది వెళ్లింది కూడా తెలిసేది కాదు. వాటి గురించి ఒక చర్చ కూడా నడిచేది కాదు. కానీ కరోనా కాలంలో ఓటీటీల్లో రిలీజైన ప్రతి సినిమా గురించి ఎంతో కొంత చర్చ నడిచింది. ఓ మోస్తరు టాక్ వచ్చినా సరే.. వాటికి వ్యూస్ బాగున్నాయి. ఓటీటీల్లో ఫస్ట్ సూపర్ హిట్‌గా నిలిచిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ థియేటర్లలో రిలీజై ఉంటే ఏమేర వసూళ్లు రాబట్టి ఉండేదో అన్నది సందేహమే. దాని గురించి సోషల్ మీడియాలో ఇంత చర్చ కూడా జరిగేది కాదేమో.
అలాగే డివైడ్ టాక్ తెచ్చుకున్న ‘ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య’ను కూడా థియేటర్లలో జనాలు పెద్దగా చూసేవాళ్లు కాదేమో. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ తర్వాత ఓటీటీ టార్గెట్‌తో సిద్ధు జొన్నలగడ్డ చాలా తక్కువ టైంలో, తక్కువ ఖర్చుతో ‘మా వింత గాథ వినుమా’ చేసేశాడు. అది ‘ఆహా’లో విడుదలైంది. దీనికంత మంచి రివ్యూలు, టాక్ రాకపోయినా సరే.. అనుకున్న దానికంటే ఎక్కువ వ్యూసే వచ్చాయట. దీంతో అటు మేకర్స్ హ్యాపీ, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ హ్యాపీ.
ఇక తాజాగా విడుదలైన ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ విషయంలో అయితే అమేజాన్ ప్రైమ్ వాళ్లు చాలా సంతృప్తిగా ఉన్నారట. భారీ ఖర్చు పెట్టి రిలీజ్ చేసిన సినిమాలతో పోలిస్తే.. తక్కువ ఖర్చుతో సొంతం చేసుకున్న ఈ చిత్రానికి స్పందన చాలా బాగుందని అంటున్నారు. ఇదే సినిమా థియేటర్లలో రిలీజైతే ఈ మాత్రం స్పందన ఉండకపోయేదేమో. ఆనంద్ దేవరకొండ కోసం జనాలు థియేటర్లకు వెళ్లి ఉండకపోవచ్చు. పైగా స్లోగా సాగే ఈ సినిమా థియేటర్లలో చూస్తే వేరే ఫీలింగ్ కలిగిస్తుంది.
టికెట్ కొని థియేటర్లకు వెళ్లి సినిమా కొంచెం అటు ఇటుగా ఉంటే జనాలు ఫ్రస్టేట్ అవుతారు. కానీ ఓటీటీలో చూసేటపుడు అది పెద్ద సమస్యగా అనిపించదు. ఓటీటీలను టార్గెట్ చేసే సినిమాలకు ప్రొడక్షన్ డిజైన్‌లోనూ మార్పు ఉంటుంది. థియేటర్లలో రిలీజ్ అంటే అన్నీ భారీగా ఉండేలా చూసుకోవాలి. కానీ ఓటీటీలను టార్గెట్ చేస్తే లొకేషన్లు, కాస్టింగ్, ఇతర విషయాల్లో భారీతనం గురించి ఆలోచించాల్సిన పని లేదు. తక్కువలో అవగొట్టేయొచ్చు. ఈ నేపథ్యంలో మున్ముందు చిన్న సినిమాలన్నీ ఓటీటీలనే టార్గెట్ చేస్తే ఆశ్చర్యమేమీ లేదు.
This post was last modified on November 30, 2020 5:11 pm
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…