మొత్తానికి ‘కాంతార: చాప్టర్-1’ సాధించింది. ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్‌గా ఈ కన్నడ సినిమా నిలుస్తుందా లేదా అనే సస్పెన్సుకు తెరపడింది. ఎట్టకేలకు ‘కాంతార: చాప్టర్-1’ ఆ రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైన బాలీవుడ్ మూవీ ‘ఛావా’ రూ.807 కోట్లతో రికార్డు నెలకొల్పగా.. తర్వాత ఏ చిత్రమూ దాన్ని దాటలేకపోయింది. ‘సైయారా’ రూ.600 కోట్ల వరకు వచ్చి ఆగిపోయింది. ‘కూలీ’ రికార్డు సాధిస్తుందనుకుంటే దానికీ అది సాధ్యం కాలేదు.
ఐతే భారీ అంచనాల మధ్య వచ్చిన ‘కాంతార: చాప్టర్-1’.. ఆ అంచనాలకు తగ్గట్లే బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టి రికార్డును సొంతం చేసుకుంది. విడుదలైన 22వ రోజుకు కాంతార వసూళ్లు రూ.818 కోట్లకు చేరుకున్నాయి. ఇది వరల్డ్ వైడ్ కలెక్షన్. ఐతే ఇంతకు మించి ‘కాంతార: చాప్టర్-1’ వసూళ్లు పెద్దగా పెరిగే అవకాం కనిపించడం లేదు. ఈ సినిమా వెయ్యి కోట్ల మార్కును కూడా అందుకోవచ్చనే అంచనాలు కలిగాయి కానీ.. అది సాధ్యం కాలేదు. ఈ చిత్రం మరి కొన్ని రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
‘కాంతార: చాప్టర్-1’ ఓవరాల్‌గా 2025 ఇండియన్ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది కానీ.. ఓవర్సీస్‌లో మాత్రం ఇది లాస్ వెంచరే అయింది. ఈ సినిమా నార్త అమెరికాలో 7 మిలియన్ డాలర్లకు పైగా కలెక్ట్ చేస్తేనే బ్రేక్ ఈవెన్ అయ్యేది. కానీ ఈ సినిమా అక్కడ 5 మిలియన్ల దగ్గర ఆగిపోయింది. ప్రిమియర్స్‌కు ఆశించిన స్పందన లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అయింది. తొలి వీకెండ్లో కూడా ఓ మోస్తరు వసూళ్లే వచ్చాయి. సినిమాకు లాంగ్ రన్ ఉన్నప్పటికీ.. ఓపెనింగ్స్ తగ్గడం మైనస్ అయి సినిమా అక్కడ లాస్ వెంచర్‌గా మిగిలింది.
This post was last modified on October 27, 2025 1:24 pm
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…