Movie News

దీపావళి ఓపెనింగ్స్ నెమ్మదిగా ఎందుకున్నాయి

ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు దీపావళి పండగని టార్గెట్ చేసుకోవడంతో థియేటర్లు జనంతో కళకళలాడిపోతాయని బయ్యర్లు ఆశించారు. అయితే టాక్స్ ఎలా ఉన్నాయనేది పక్కనపెడితే అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం.  మిత్ర మండలి ప్రీమియర్లకు ఫాస్ట్ ఫిల్లింగ్ కనిపించింది కానీ సోషల్ మీడియా ట్రెండ్స్ గమనిస్తే వాటిలో అధిక శాతం గివ్ అవే రూపంలో ట్విట్టర్ ద్వారా పంచిన టికెట్లేనని అర్థమైపోతోంది. తెలుసు కదాలో ప్రామిసింగ్ క్యాస్టింగ్ ఉన్నా ఆశించిన స్థాయిలో దూకుడు లేదు. జానర్ పరిమితుల వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా దాని వైపు చూడలేదు.

ఉన్నంతలో డ్యూడ్ కొంచెం డీసెంట్ ఆక్యుపెన్సీలు చూపించింది కానీ మైత్రి ప్రదర్శించిన నమ్మకంతో పోల్చుకుంటే అదీ తక్కువేనని చెప్పాలి. ఎబోవ్ యావరేజ్ నుంచి మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. ఇక ప్రమోషన్ల పరంగా చాలా హడావిడి చేసిన కె ర్యాంప్ సైతం బుకింగ్స్ విషయంలో పోరాడుతోంది. దీనికీ టాక్ చాలా కీలకం. ఇక అసలు పండక్కు ఇంత స్లో ఓపెనింగ్స్ ఎందుకున్నాయనే పాయింట్ కు వద్దాం. వరసగా రెండు వారాలు ఓజి, కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ ని పది రోజుల పాటు ఎక్కువ ధరలకు చూసిన ప్రేక్షకులు వెంటనే కొత్త సినిమాలకు చూసేందుకు సరిపడా ఊపు, బజ్ మేకర్స్ సృష్టించలేకపోయారనేది వాస్తవం.

ఇంతకన్నా ఏం చేయాలని నిర్మాతలు అనుకోవచ్చు. నిజమే. ఎంత చేయాలో అంతా చేశారు. అసలు సమస్య జనాల మూడ్ మీద ఆధారపడి ఉంటుంది. పవన్ కళ్యాణ్, రిషబ్ శెట్టి ఇచ్చిన హై ఏదైతే ఉందో ఆ హ్యాంగోవర్ నుంచి బయట పడే స్థాయిలో కొత్త కంటెంట్లు వచ్చాయనే నమ్మకాన్ని పూర్తి స్థాయికి క్రియేట్ చేయలేకపోయారు. ఒకవేళ యునానిమస్ గా సూపర్ హిట్ అనిపించుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. పండగ ఎలాగూ సోమ మంగళవారాలు కాబట్టి వీకెండ్ కంతా పికప్ అయిపోవచ్చు. కాకపోతే గత ఏడాది లాగా దీపావళికి మూడు బ్లాక్ బస్టర్లు పడటం జరిగేలా లేదు. ఉన్నంతలో ఎవరు ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటారో చూడాలి.

This post was last modified on October 18, 2025 9:08 am

Share

Recent Posts

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

17 minutes ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

3 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

5 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

6 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

6 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

7 hours ago