ప్రభాస్ నటిస్తోన్న మొట్టమొదటి స్ట్రెయిట్ హిందీ సినిమా అయిన ఆదిపురుష్‍కి మంచి బజ్ వచ్చింది. రామాయణాన్ని సరికొత్తగా చూపించబోతున్న ఈ చిత్రం విషయంలో ప్రభాస్ కూడా చాలా ఆసక్తిగా వున్నాడు. అయితే ఈ చిత్రానికి కాస్టింగ్ పరంగా దూకుడు చూపించడం లేదు. ప్రభాస్‍తో నాగ్ అశ్విన్ తీసే సినిమాకే దీపిక పడుకోన్ హీరోయిన్ కాగా ఆదిపురుష్‍లో సీతగా కృతి సనన్ నటిస్తుందట. ఆమె పాపులర్ అయినా కానీ కచ్చితంగా టాప్ హీరోయిన్ల తర్వాత శ్రేణిలోకే వస్తుంది. ఇక ఇందులో రావణుడిగా నటించే సైఫ్ అలీ ఖాన్‍కి కూడా ఇప్పుడంతగా క్రేజ్ లేదు.
హీరో ఇమేజ్ పోయి వెబ్ సిరీస్‍ల రేంజ్‍కి సైఫ్ ఎప్పుడో పడిపోయాడు. లక్ష్మణుడి పాత్రకు కూడా సన్నీ సింగ్ లాంటి వర్ధమాన నటుడినే ఎంచుకున్నారు. దీనిని బట్టి కాస్టింగ్ పరంగా కాస్ట్ కటింగ్ క్లియర్‍గా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అయిదారు భాషలలో విడుదల చేసే ఆలోచన వున్నపుడు కాస్టింగ్ మరింత బలంగా పెట్టుకోవాలి. ప్రభాస్ కూడా ఎలాంటి డిమాండ్లు చేస్తున్నట్టు లేడు. అందుకే నిర్మాతలు ఇక్కడే కాస్ట్ కంట్రోల్‍లో పెడుతున్నారు. కరోనా టైమ్స్ కూడా ఇందుకు కారణం అనుకోవచ్చు. అయితే ఇక్కడ తగ్గించిన మొత్తం మేకింగ్‍కి వాడితే క్వాలిటీ బాగా వస్తుందనుకోవచ్చు. అక్కడా నిర్మాతలు పిసినారితనం చూపిస్తే మాత్రం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టవుతుంది పరిస్థితి.
This post was last modified on November 29, 2020 1:41 am
బిలియనీర్.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అదానీ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు క్రియేట్ చేసిన కార్పొరేట్ సంచలనం…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. సమీపంలోనే జరగబోయే మూడు ఐపీఎల్ సీజన్ల తేదీలను ముందుగానే…
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా…
టీడీపీ సీనియర్ నాయకురాలు, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత… రాజకీయంగా చర్చనీయాంశం అయ్యారు. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత తోపుదుర్తి…
గేమ్ ఛేంజర్ ఇంకా విడుదలే కాలేదు రామ్ చరణ్ అప్పుడే తన తదుపరి సినిమాను పట్టాలెక్కించేశాడు. సుకుమార్ ప్రియ శిష్యుడు…