Movie News

మహేష్‌ రీల్‌తో మొత్తం మారిపోయింది

నిహారిక.ఎం.. సోషల్ మీడియాను బాగా ఫాలో అయ్యే వాళ్లకు ఈమె పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో ఆమె బాగా పాపులర్. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నిహారిక ఎప్పుడో స్టార్ స్టేటస్ సంపాదించింది. ‘మిషన్ ఇంపాజిబుల్’ ఇండియా ప్రమోషన్లలో భాగంగా హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రుయిజ్‌తో కలిసి ఆమె వీడియోలు చేయడం విశేషం.

అంతకంటే ముందు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతోనూ ఆమె రెండు ప్రమోషనల్ వీడియోలు చేసింది. ఫారిన్లో ఉంటూ ఇండియాలో భారీగా ఫాలోవర్లను సంపాదించుకుందీ అమ్మాయి. ‘మేజర్’ సినిమా కోసం మహేష్ బాబుతో కలిసి ఆమె చేసిన ప్రమోషనల్ వీడియో వైరల్ అయింది. అదే తన జీవితంలో అతి పెద్ద మలుపు అంటోంది నిహారిక.

మహేష్‌తో అంతకంటే ముందు ‘సర్కారు వారి పాట’ కోసం కూడా ఒక వీడియో చేశానని.. కానీ ‘మేజర్’ టైంలో చేసిన వీడియో వైరల్ అయిపోయి తనకు ఇండియాలో ఎక్కడ లేని పాపులారిటీ తెచ్చిపెట్టిందని నిహారిక తెలిపింది. అప్పటిదాకా ఫారిన్లోనే సెటిల్ అవ్వాలి అనుకుంటూ వచ్చిన తాను.. ఈ వీడియో తర్వాత ఇక్కడే కెరీర్‌ను వెతుక్కున్నానని ఆమె చెప్పింది. ఇన్‌స్టా ద్వారా మంచి ఆదాయం, ఫేమ్ రావడంతో తాను ఇండియాలోనే సెటిలైపోయానని ఆమె చెప్పింది. 

ఈ నెల 16న విడుదల కానున్న ‘మిత్ర మండలి’తో నిహారిక టాలీవుడ్లోకి అడుగు పెడుతోంది. ఇప్పటికే ఆమె తమిళంలో ‘పెరుసు’ అనే సినిమ ా చేసింది. అది హిట్టయింది. ఐతే దాని కంటే ముందే తాను ‘మిత్రమండలి’ సైన్ చేశానని.. కానీ ఇందులో పెద్ద కాస్టింగ్ ఉండడంతో వారి డేట్లు సెట్ అయి సినిమా మొదలు కావడంలో కొంత ఆలస్యం జరిగిందని.. అందు వల్ల ‘మిత్రమండలి’ తన రెండో సినిమా అయిందని నిహారిక చెప్పింది. ఇది క్లీన్ ఎంటర్టైనర్ అని.. అన్ని వర్గాల ప్రేక్షకులూ కడుపుబ్బ నవ్వుకుంటారని ఆమె చెప్పింది.

This post was last modified on October 9, 2025 6:13 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

35 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

12 hours ago