Movie News

దీపావళికి లీడ్ తీసుకునేదెవరు?

కొన్ని నెలలుగా డల్లుగా సాగుతున్న టాలీవుడ్ బాక్సాఫీస్‌కు సెప్టెంబరులో మంచి ఊపే వచ్చింది. అక్టోబరులోనూ ‘కాంతార: చాప్టర్-1’తో మంచి ఆరంభమే దక్కింది. ఈ వారం ‘శశివదనే’ సహా కొన్ని చిన్న సినిమాలు వస్తున్నాయి. వాటికి స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ఆ తర్వాతి వారం బాక్సాఫీస్ కళకళలాడే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీపావళి ముంగిట వారాంతంలో ఏకంగా నాలుగు సినిమాలు రిలీజవుతుండడం విశేషం.

వీటిలో ఏది ఎక్కువ ఓపెనింగ్ తెచ్చుకుంటుంది.. ఏది పెద్ద హిట్ అవుతుంది అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముందుగా 16న ‘మిత్రమండలి’ సినిమా రిలీజ్ కానుంది. ఇది జాతిరత్నాలు, మ్యాడ్ తరహా బిందాస్ ఎంటర్టైనర్‌లా కనిపిస్తోంది. దీనికి మంచి ఓపెనింగే రావచ్చు. కానీ ‘మిత్రమండలి’కి రెండో రోజే గట్టి పోటీ ఎదురు కానుంది. 17న ‘తెలుసు కదా’, ‘డూడ్’ రిలీజవుతున్నాయి. 

‘టిల్లు స్క్వేర్’ తర్వాత ‘జాక్’తో పెద్ద షాక్ తిన్న సిద్ధు జొన్నలగడ్డ.. ‘తెలుసు కదా’ మీద మంచి అంచనాలతో ఉన్నాడు. ఈ సినిమా ప్రోమోలు ప్లెజెంట్‌గా కనిపిస్తున్నాయి. మళ్లీ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ తరహా రొమాంటిక్ ఎంటర్టైనర్‌తో సిద్ధు ప్రేక్షకులను పలకరించబోతున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమాకు యూత్‌లో క్రేజ్ బాగానే ఉంది.

కానీ తమిళ సినిమా కదా అని ‘డూడ్’ను తక్కువ అంచనా వేస్తే కష్టమే. ‘లవ్ టుడే’, ‘డ్రాగన్’ చిత్రాలతో తెలుగు యువతను బాగానే ఆకట్టుకున్నాడు ప్రదీప్ రంగనాథన్. పైగా ‘డూడ్’ను నిర్మించింది తెలుగు ప్రొడక్షన్ హౌస్ అయిన ‘మైత్రీ మూవీ మేకర్స్’. ఇది ‘ప్రేమలు’ తర్వాత మామిత బైజు హీరోయిన్‌గా చేసిన సినిమా కూడా కాబట్టి ‘డూడ్’ తెలుగు చిత్రాలను మించి ఓపెనింగ్ తెచ్చుకుంటే, తొలి రోజు హౌస్ ఫుల్స్‌తో రన్ అయితే ఆశ్చర్యమేమీ లేదు.

ఇక దీపావళి రేసులో చివరగా 18న కిరణ్ అబ్బవరం సినిమా ‘కే ర్యాంప్’ రిలీజ్ కానుంది. ‘క’తో మంచి క్రేజ్ సంపాదించుకున్నప్పటికీ.. ‘దిల్ రుబా’తో డౌన్ అయ్యాడు కిరణ్. ‘కే ర్యాంప్’ ప్రోమోలు మంచి స్పందనే తెచ్చుకున్నాయి. యూత్‌‌కు నచ్చే బోల్డ్ కంటెంట్, కామెడీ సినిమాలో బాగానే ఉన్నట్లున్నాయి. కానీ ఇంత పోటీ మధ్య సాధారణ కంటెంట్ ఉంటే మాత్రం ‘కే ర్యాంప్’కు ఇబ్బంది తప్పదు. రేసులో చివరగా రావడం వల్ల దీనికి ఓపెనింగ్స్ మరీ ఎక్కువ ఆశించడానికి వీల్లేదు. ప్రస్తుతానికి ఓపెనింగ్ విషయంలో ప్రధాన పోటీ ‘తెలుసు కదా’, ‘డూడ్’ చిత్రాల మధ్యే ఉండొచ్చని అంచనా.

This post was last modified on October 9, 2025 6:07 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

వీసా ఇంటర్వ్యూ.. ఇక నుంచి మరో టెన్షన్

అమెరికా వీసా (H-1B, H-4) కోసం అప్లై చేసేవారికి కొత్త టెన్షన్ మొదలైంది. ఇకపై ఇంటర్వ్యూకి వెళ్లేముందు సర్టిఫికెట్లు సరిచూసుకోవడమే…

42 minutes ago

ఆర్‌బీఐ సంచలన నిర్ణయం.. మీ ఈఎంఐ తగ్గుతుందా?

దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఒకపక్క రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 90 దాటి పాతాళానికి…

46 minutes ago

‘పవన్ అన్న’ మాటే… ‘తమ్ముడు లోకేష్’ మాట!

కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…

3 hours ago

అవకాశాన్ని ఆంధ్రకింగ్ వాడుకుంటాడా

రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…

6 hours ago

అఖండ 2 ఆగింది… అసలేం జరుగుతోంది

బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…

7 hours ago

అన్నగారు వచ్చేలా లేరు

నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…

7 hours ago