టాలీవుడ్ సీనియర్, లెజెండరీ హీరోల్లో ఒకరైన అక్కినేని నాగార్జున వందో సినిమా ముంగిట ఉన్నాడు. ఆ సినిమా కోసం అభిమానులు చాన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. కొన్నేళ్ల ముందు నుంచి ఇదిగో అదిగో అంటున్నారు కానీ.. ఎంతకీ ఆ సినిమా మొదలు కావట్లేదు. మోహన్ రాజా సహా వేర్వేరు దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. పక్కకు వెళ్లిపోయాయి. చివరికి తమిళ దర్శకుడే అయిన రా.కార్తీక్‌తో నాగ్ జట్టు కట్టబోతున్నట్లు వార్తలు వచ్చాయి.
చివరికి స్వయంగా నాగార్జునే ఈ యువ దర్శకుడితో తన వందో సినిమా ఉంటుందని ఇటీవలే కన్ఫమ్ చేయడంతో అభిమానులు ఖుషీ అయ్యారు. నాగ్ పుట్టిన రోజు అయిన ఆగస్టు 29న అ సినిమా అనౌన్స్‌మెంట్ ఉంటుందని ఆశించారు కానీ.. అది జరగలేదు. ఐతే స్క్రిప్టు పక్కాగా రెడీ అయి, షూటింగ్‌కు ఏర్పాట్లు జరిగాకే సినిమాను అనౌన్స్ చేయాలనే ఉద్దేశంతో నాగ్ అండ్ టీం ఆగినట్లు తెలుస్తోంది. అతి త్వరలో ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకోనున్నట్లు సమాచారం.
నాగ్ వందో సినిమాకు క్రేజీ టైటిల్ పెట్టబోతున్నట్లు ఓ సమాచారం బయటికి వచ్చింది. లాటరీ కింగ్ అనే టైటిల్‌తో ఈ సినిమా రాబోతోందట. నాగ్ ఇప్పటికే కింగ్ సినిమా చేశాడు. ఆ సినిమా తర్వాతి నుంచి నాగ్‌ను అభిమానులు యువ సామ్రాట్ అని కాక కింగ్ అని పిలుచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నాగ్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీకి అది కలిసొచ్చేలా లాటరీ కింగ్ అనే టైటిల్ ఖాయం చేసినట్లు చెబుతున్నారు. వందో సినిమాలో అన్ని కమర్షియల్ హంగులూ ఉండాలన్న అభిమానుల ఆకాంక్షలకు తగ్గట్లే ఈ చిత్రం ఉంటుందని నాగ్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు.
ముందు నాగ్ వందో సినిమా రీమేక్ అని వార్తలు వచ్చినా.. నాగ్ ఆ ప్రచారాన్ని ఖండించాడు. ఇది గ్రాండియర్ ఉన్న సినిమా అని, భారీ యాక్షన్ ఉంటుందని.. దాంతో పాటే ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్లూ ఉంటాయని స్పష్టం చేశాడు. చివరగా హీరోగా 2024 సంక్రాంతికి నా సామిరంగ చిత్రంతో పలకరించిన నాగ్.. ఈ ఏడాది కుబేర, కూలీ చిత్రాల్లో ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. ఆయన వందో సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.
This post was last modified on October 7, 2025 9:44 am
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…
ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…
ఏదైనా కథ, పాత్ర, లేదా పాట విషయంలో పాత సినిమాల నుంచి స్ఫూర్తి పొందడం కొత్తేమీ కాదు. ఐతే అలా…
నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా గురించి నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం…
నిన్న కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' టైటిల్ రివీల్ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అరిటాకులో భోజనాలు వడ్డించే ఒక…