Movie News

దీపావళి పండక్కు కుర్ర హీరోల కొట్లాట

ఈసారి దీపావళి పండక్కు స్టార్లు క్లాష్ కావడం లేదు కానీ కుర్ర హీరోల మధ్య కొట్లాట పెద్దదే జరగనుంది. అక్టోబర్ పదహారు, పదిహేడు తేదీల్లో ఏకంగా నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలపడబోతున్నాయి. హైప్ పరంగా వాటిలో మొదటిది సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా. నీరజ కోన దర్శకురాలిగా పరిచయమవుతున్న ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. తమన్ కంపోజ్ చేసిన రెండు పాటలు ఆల్రెడీ మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకున్నాయి. జాక్ ఇచ్చిన షాక్ నుంచి కోలుకున్న సిద్ధూ ఈసారి లౌడ్ కామెడీ లేకుండా రొమాంటిక్ జానర్ వైపు షిఫ్ట్ అయిపోవడం ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

రెండోది కిరణ్ అబ్బవరం కె ర్యాంప్. కేరళ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ యూత్ మాస్ మూవీ బూతుల గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. హీరో దర్శకుడు తమవైపు వాదనలతో సమర్ధించుకుంటున్నారు కానీ సెన్సార్ సర్టిఫికెట్ ని బట్టి ఇది ఏ క్యాటగిరీనో క్లారిటీ వస్తుంది. గత ఏడాది ఇదే టైంలో క రూపంలో బ్లాక్ బస్టర్ అందుకున్న కిరణ్ కు ఆ తర్వాత దిల్ రుబా మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. సో కె ర్యాంప్ హిట్టు కావడం చాలా అవసరం. మూడోది ప్రదీప్ రంగనాధన్ డ్యూడ్. మైత్రి ప్రొడక్షన్ తో పాటు హీరోకు లవ్ టుడే, డ్రాగన్ పుణ్యమాని ఏర్పడిన మార్కెట్ వల్ల ఈ డబ్బింగ్ మూవీకి మంచి బిజినెస్ జరిగేలా ఉంది.

నాలుగోది మిత్ర మండలి. ప్రియదర్శితో పాటు మరో ముగ్గురు క్యారెక్టర్ ఆర్టిస్టులు నటించిన ఈ ఎంటర్ టైనర్ మీద నిర్మాత బన్నీ వాస్ చాలా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. లిటిల్ హార్ట్స్, జాతి రత్నాలు తరహాలో ఇది కూడా సర్ప్రైజ్ బ్లాక్ బస్టర్ అవుతుందని ధీమాగా ఉన్నారు. పండగ టైంకి ఓజి, కాంతారా చాప్టర్ 1 ఫైనల్ రన్ లు దాదాపు చివరికి వచ్చేసి ఉంటాయి కాబట్టి ఫెస్టివల్ ని వాడుకోవడం కుర్ర హీరోల చేతిలో ఉంది. సెలవులు పరిమితంగా ఉన్నప్పటికీ వీటి బడ్జెట్ ల దృష్ట్యా పాజిటివ్ టాక్ వస్తే బడ్జెట్ లు త్వరగా రికవర్ అవుతాయి. అన్ని సినిమాల థియేట్రికల్ బిజినెస్ లు కలిపినా వంద కోట్ల లోపే ఉండబోవడం విశేషం.

This post was last modified on October 4, 2025 3:17 pm

Share

Recent Posts

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

30 minutes ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

37 minutes ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

41 minutes ago

దుబాయ్ విమానంలో ఫైటింగ్… 180 మందిని కాపాడిన ఇండియన్ కెప్టెన్

భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…

1 hour ago

405 అయినా సరే… తగ్గేదే లే!!

వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…

1 hour ago

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

2 hours ago